రాష్ట్రీయం

సయోధ్య కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలులో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జోక్యంతో తొలగిపోయింది. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం ‘ఆషా’ తన ఆందోళనను విరమించుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వైద్యసేవల ధరల్లో ఫిబ్రవరి 1నుంచి 21.11 శాతం పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇక ప్రతి ఏడాది ప్యాకేజీ ధరలు పెరగనున్నాయి. ముందుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సిఇఒ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ‘ఆషా’ తరపున అధ్యక్షుడు డాక్టర్ పి.రమేశ్ బాబు, కార్యదర్శి డాక్టర్ మురళి, డాక్టర్ రమణమూర్తి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం మంత్రి కామినేని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రస్టు-ఆషాల మధ్య ఒక అవగాహన కుదిరింది. ఈ రెండు సమావేశాలకు 357 ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రుల యజమానులు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించారు. హెల్త్ కార్డుల విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నగదు రహిత వైద్యసేవలు అందించాలని మంత్రి కామినేని పలుమార్లు కోరారు. రాష్ట్రంలో కొత్తగా 222 ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు.

చిత్రం..ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్