రాష్ట్రీయం

బడ్జెట్ భేటీలోగా నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన రెండు కమిటీలు బడ్జెట్ సమావేశాల్లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మరో రెండు సమావేశాలు ఫిబ్రవరి 4, 10 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా 2013 ఎస్సీ, ఎస్టీ చట్టంలో అవసరమైన మార్పులు చేయాల్సి ఉందని, ఆ మార్పులకు కమిటీలు సవరణలు సూచించాలన్నారు. సిఎం ఆదేశాల మేరకు ఏర్పాటైన రెండు కమిటీలు సోమవారం సర్వ శిక్షా అభియాన్ కేంద్రంలో సమవేశమయ్యాయి. సమావేశానికి మంత్రులు చందూలాల్, జగదీష్‌రెడ్డి, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇంతవరకూ దళితులు, గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో మార్పులు చేయాల్సి ఉందని, అలాగే కొత్త పథకాల కోసం రూపకల్పన చేయాల్సి ఉందన్నారు. వీటికి చట్టబద్ధత కల్పించడం ముఖ్యమైంనదన్నారు. కేంద్రం ఈసారి బడ్జెట్‌ను రెవిన్యూ వ్యయం, క్యాపిటల్ వ్యయం ఆధారంగా ప్రవేశపెడుతున్న నేపఎథ్యంలో ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ నిధులు ప్లానింగ్‌లో ఉండే అవకాశం లేదన్నారు. ఈ కోణంలో వారికి అన్యాయం జరగకుండా, అభ్యున్నతికి
యుద్ధప్రాతిపదికపై చేపట్టాల్సిన చర్యలను వివరించాలని సిఎం కెసిఆర్ కమిటీలను ఆదేశించినట్టు కడియం వెల్లడించారు. దీంతో ఈ రెండు కమిటీలు దళితులు, గిరిజనుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులపై లోతుగా చర్చించి నివేదిక సమర్పించనున్నాయన్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఒక విజన్ ఉందని, కేవలం ఆర్ధిక సాయమేగాక, ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ప్రణాళికలు రచించాల్సి ఉందన్నారు. అధికారుల కమిటీ, ఇద్దరు సమన్వయ అధికారులను కూడా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.
సమావేశంలో ఎంపీలు బాల్కసుమన్, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, ఆరూరి రమేశ్, నల్లాల ఓదేలు, కోవా లక్ష్మీ, సండ్ర వెంకట వీరయ్య, సున్నం రాజయ్య, సంజీవ రావు, ఎమ్మెల్సీలు రాములు నాయక్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, స్పెషల్ సిఎల్ అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.