రాష్ట్రీయం

గలగలా పాలేరుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 30: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి ఏడాదిలో నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం సిఎం కెసిఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి భక్తుడైన భక్త రామదాసు జన్మదినం రోజే ప్రాజెక్టును ప్రారంభిస్తుండటం విశేషం. 330 కోట్ల రూపాయలతో కేవలం 11 నెలల కాలంలోనే 60 వేల ఎకరాలకు నీరందించేలా నిర్మించిన పథకం ద్వారా అత్యంత కరవు పీడిత ప్రాంతమైన పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. ఈ పథక నిర్మాణంలో గతంలో ఇందిరాసాగర్ పథకం కోసం సేకరించిన పంపులు, మోటర్లు, సుమారు 5,500 పైపులు వినియోగించారు. ఈ పథకానికి అవసరమైన 128.07 ఎకరాలను 123 జీవో కింద సేకరించారు. గత ఏడాది ఫిబ్రవరి 16న సిఎం కెసిఆర్ ఈ పథక నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఈ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్‌గా ఉన్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ గడువుకు ముందే పని పూర్తి చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం నుంచి 5.5 టిఎంసి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డిబిఎం 60 కింద నీటి ఎద్దడి ఉన్న 60 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు రూపొందించారు. పాలేరు జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌తండా వరకు పైపుల ద్వారా నీటిని తీసుకువచ్చి అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వల ద్వారా ఆయకట్టుకు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా పరిధిలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల పరిధిలోని 43 గ్రామాల పరిధిలోని 57 వేల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని రెండు గ్రామాల్లోని సుమారు రెండు వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఈ పథకానికి రెండు పంపులను ఏర్పాటు చేయగా మొదటి పంపును ఈనెల 23వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించారు. రెండవ పంపుకు ఈనెల 28వ తేదీన ట్రయల్న్ నిర్వహించాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో నిర్వహించలేదు. కాగా పథకం శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిత్యం పర్యవేక్షిస్తూ పనులలో నాణ్యతా లోపం రాకుండా పర్యవేక్షించారు.
సిఎం కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం పాలేరు రిజర్వాయర్ వద్దకు చేరుకుని మిషన్ భగీరథ పనులను పరిశీలించిన అనంతరం భక్త రామదాసు ప్రాజెక్టు ఇన్‌టేక్ వెల్ నిర్మించిన ఎర్రగడ్డ తండా వద్ద ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం ఇస్లావత్ తండా వరకు కాలువల పక్కన రహదారి మార్గం గుండా ప్రయాణించి ట్యాంకులను పరిశీలిస్తారు. అనంతరం శంకుస్థాపన జరిగిన ప్రాంతంలోనే నిర్వహిస్తున్న బహిరంగ సభలో మాట్లాడతారు.

చిత్రం..భక్త రామదాసు ఎత్తిపోతల పథకం