రాష్ట్రీయం

దాసరికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31:ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. సోమవారం దాసరి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్‌లో చేర్పించారు. కిడ్నీ పనితీరు సక్రమంగా లేకపోవడంతో డాక్టర్లు డయాలసిస్ చేశారు. అలాగే ఊపిరితిత్తుల పనితీరు మందగించిందని, అన్నవాహిక ఇన్‌ఫెక్షన్‌కు గురైందని కిమ్స్ ఎండి, సిఇవో డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు మంగళవారం తెలిపారు. అన్నవాహికలో వచ్చిన ఇన్‌ఫెక్షన్ మూత్ర పిండాలకూ పాకిందని అన్నారు. శస్త్ర చికిత్స ద్వారా ఇన్‌ఫెక్షన్ తొలగించామని, ఇన్‌ఫెక్షన్ సోకిన చోట మెటల్ స్టంట్ వేశామని వివరించారు. దాసరికి ప్రస్తుతం వెంటిలెటర్ సాయంతో వైద్యం అందిస్తున్నామన్నారు. సోమవారం కంటే ఆరోగ్యం కంటే మెరుగ్గా ఉందని, మరో రెండు, మూడు రోజుల్లో బాగా కోలుకుంటారని డాక్టర్ భాస్కరరావు చెప్పారు. దాసరి నారాయణ రావును ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలియగానే సినీ నటులు మోహన్‌బాబు, జయసుధ, అల్లు అరవింద్, మంచు మనోజ్, దర్శకుడు కె రాఘవేంద్ర రావు ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ దాసరి కావాల్సిన వ్యక్తి అని, ఆయన నిండునూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆసుపత్రికి వచ్చి దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న కిమ్స్ ఎండి, సిఇవో డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు