రాష్ట్రీయం

ఆక్సిజన్ అందక 9మంది మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నల్లకుంట, జనవరి 31: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మంగళవారం ఒకేరోజు తొమ్మిది మంది రోగులు మరణించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్లనే చనిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సకాలంలో వైద్యం అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రోగులకు ఆక్సిజన్ అందకపోవ టం వల్ల మృతి చెందినట్లు బంధువులు అరోపిస్తున్నారు. అక్యూట్ న్యూరో సర్జరీ కేర్ యూనిట్‌లో నలుగురు, అక్యూట్ మెడికల్ కేర్‌లో ముగ్గురు, ఎమర్జెన్సీలో మరో ఇద్దరు మృతి చెందారు. ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా వాటికి అమర్చే ఫ్లో మీటర్లు లేకపోవటం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కేవలం వెయ్యి నుంచి రెండువేల రూపాయల విలువ చేసే మీటర్లును సమకూర్చాలంటూ ఆసుపత్రి వర్గాలు ప్రతిపాదనలు పంపించినా పట్టించుకోలేదని సమాచారం. అయితే ఉస్మానియా సూపరింటెండెంట్ జివిఎస్ మూర్తి మాత్రం ఈ మరణాలు సహజంగా జరిగినవే తప్ప, లోపాల వల్ల కాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన వివరించారు.