రాష్ట్రీయం

కోటి ఎకరాలకు నీళ్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 31: అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుని, చరిత్ర సృష్టించిన భక్తరామదాసు ప్రాజెక్టు స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను నిర్మిస్తామని, ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు అభివృద్ధి ద్వారానే సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం యర్రగడ్డ తండావద్ద నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ప్రారంభించిన ఆయన తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌తండా వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాలలో కోటి ఎకరాలను తడిపే వరకూ విశ్రమించబోనన్నారు. భక్త రామదాసు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని శ్రీరామచంద్రుడికి గుడి కట్టాడని, ఆయన స్ఫూర్తితోనే ప్రజల సమస్యలను పరిష్కరించి వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటామని అన్నారు. యాభై ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీలు చేయలేని పనిని అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి
చూపించిందన్నారు. తమ నిబద్ధతకు భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణమే ఉదాహరణ అన్నారు. పక్కనే భారీ రిజర్వాయర్ ఉన్నా దశాబ్దాలపాటు కరవుతో అల్లాడిన పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా 35వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు చేపట్టామని, అర్హులైన ప్రతివారిని ఏదో ఒక రూపంలో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఇది జీర్ణించుకోలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాలను నమ్మి మాజీమంత్రి చిదంబరం రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగడంలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయనకు భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం సమాధానం చెప్పిందన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తది అన్న వారికి రెండున్నరేళ్ళలో అనేక రీతిలో సమాధానాలు చెప్పామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలెంవాగు, కినె్నరసాని ప్రాజెక్టులను కూడా పూర్తిచేసి ప్రజలకు ఆనందాన్ని, ప్రతిపక్షాలకు సమాధానాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా కాంగ్రెస్ నేతలు కొందరు ముఠాగా ఏర్పడి అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని, దీనికి ప్రజల మద్దతుతో సమాధానం చెబుతామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 16వేల చెరువులను పునరుద్ధరించామని, మరో 30వేలు అభివృద్థి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతివారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి తెలంగాణ ఏర్పడేంత వరకు రాష్ట్రంలో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో 2,776 కిలోమీటర్లు జాతీయ రహదారులుగా మార్చుకోగలిగామన్నారు. భక్తరామదాసు స్వస్థలమైన నేలకొండపల్లిలో భక్తరామదాసు మెమోరియల్‌ను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
ఏడాదిలోగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లానీరు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చారు. అంతకుముందు ఆయన పాలేరు, మాదిరిపురంలలో నిర్మించిన ఇన్‌టెక్‌వెల్ పనులను పనులను పరిశీలించారు. బహిరంగ సభ వేదికగా ఇటీవల పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న వనజీవి రామయ్యను, భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసిన మెగాకంపెనీ ఎండి రామిరెడ్డిని ఘనంగా సన్మానించారు.

చిత్రం..భక్తరామదాసు ప్రాజెక్టు నీటికి పూజలు చేస్తున్న సిఎం కెసిఆర్