తెలంగాణ

డిండి ఎత్తిపోతలకు తుది రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంపై పలు మార్పు లు..చేర్పులు చేసి ఎట్టకేలకు తుది రూపునిచ్చారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, సలహాదారులతో చర్చించిన సిఎం కెసిఆర్ డిండి ఎత్తిపోతల పథకం నీటి సేకరణ సామర్ధ్యాన్ని 30టిఎంసిల నుండి 60టిఎంసిలకు పెంచేలా రిజర్వాయర్ల సామర్ధ్యం, ప్రధాన కాలువ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. రోజుకు 0.5టిఎంసిల నీటిని తీసుకునే పాత డిజైన్‌లో మార్పులు చేసి రోజుకు 1టిఎంసి చొప్పున 60రోజుల్లో 60టిఎంసిల నీటిని తీసుకునేలా రీడిజైన్‌లో మార్పు చేశారు. జంటనగరాలకు 30టిఎంసిల నీటిని డిండి ఎత్తిపోతల ద్వారా తరలించాలని కొత్తగా నిర్ణయించారు. ఇరిగేషన్ శాఖకు ఏటా బడ్జెట్‌లో 25వేల కోట్ల రూపాయలు కేయిస్తున్నందున ప్రతి నెల 2083కోట్ల రూపాయల విడుదలకు అనుగుణంగా పనులు జరిపించాలని సిఎం ఆదేశించారు. రెండు వారాల్లోగా డిండి ఎత్తిపోతలకు టెండర్లు పిలువాలన్న సిఎం ఆదేశంతో అందుకు తగిన కసరత్తులో ఇరిగేషన్ అధికారులు తలమునకలేస్తున్నారు. ఇప్పటికే 12వేల ఎకరాల మేరకు భూసేకరణకు గాను 9వేల భూసేకరణ పూర్తి చేశారు.
సొరంగ రహిత డిండి ఎత్తిపోతల
డిండి ఎత్తిపోతల పథకంలో గతంలో 7.2కిలోమీటర్ల సొరంగమార్గం ఉండగా ఇప్పుడు దాని స్థానంలో ప్రధాన కాలువను 430 కాంటూర్ లెవల్‌తో నిర్మించనున్నారు. డిండి జలాశయం ఎగువన 21కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో మేడిపూర్ వద్ద కొత్తగా జలాశయం నిర్మించి అక్కడి నుండి ప్రధాన కాలువతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 0.5టిఎంసి సామర్ధ్యంతో కూడిన జూపల్లి రిజర్వాయర్‌కు, 5.4టిఎంసిల ఇర్వి రిజర్వాయర్‌కు కృష్ణా నీరు చేరుతుంది. కొత్తగా నిర్మించే ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా 50వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక ప్రధాన కాలువ డిండి మండలంలోని 1టిఎంసి సింగరాజుపల్లి రిజర్వాయర్‌కు, 1.76టిఎంసిల గొట్టిముక్కల రిజర్వాయర్‌కు, 5.7టిఎంసిల కిష్టరాంపల్లి రిజర్వాయర్‌కు నీరందిస్తుంది. చింతపల్లి మండలంలో కొత్తగా నిర్మించే 1.5టిఎంసిల సామర్ధ్యంతో నిర్మించే రిజర్వాయర్‌కు చేరుతుంది. ఇక్కడ పసునూరు, ఎస్.లింగోటంల వద్ధ చిన్న రాజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. తదుపరి పాత డిజైన్ మేరకు 5.7టిఎంసిలతో నిర్మించ తలపెట్టిన కిష్టరాంపల్లి రిజర్వాయర్‌ను 9 టిఎంసిలకు, 7టిఎంసిల శివన్నగూడెం రిజర్వాయర్‌ను 10టిఎంసిలకు పెంచాలని రీడిజైనింగ్‌లో ఖరారు చేశారు. అలాగే నూతన డిజైన్‌లో శివన్నగూడెం నుండి రాచకొండలో కొత్తగా నిర్మించే 20టిఎంసిలతో నిర్మించే రిజర్వాయర్‌కు, ఇబ్రహీంపట్నం శామీర్ పేట రిజర్వాయర్‌కు హైద్రాబాద్ తాగునీటి అవసరాలకు కోసం కృష్ణా నీటిని తరలిస్తారు. మొత్తంగా డిండి ఎత్తిపోతల రీడిజైనింగ్‌తో జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, సాగర్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని 3లక్షల ఎకరాలకు సాగునీరు, 204గ్రామాలకు తాగునీరు అందనుంది. రీడిజైన్ మేరకు జిల్లాల ముంపు గ్రామాల సంఖ్య లేదా భూవిస్తీర్ణంలో ఎలాంటి పెరుగుదల ఉండటం లేదని ఇరిగేషన్ శాఖ చెబుతోంది.

డిండి రిజర్వాయర్