ఆంధ్రప్రదేశ్‌

పేలిన మందుపాతర ఆరుగురు పోలీసుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుగురు పోలీసుల దుర్మరణం

ఏఓబిలో మావోయిస్టుల ఘాతుకం మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
మృతులంతా ఒడిశావాసులే సుంకి- సాలూరు హైవేపై నిలిచిన వాహనాలు

విశాఖపట్నం/ పాచిపెంట/ సాలూరు, ఫిబ్రవరి 1: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబి)లో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ఉభయ రాష్ట్రాల పోలీసు అధికారులు ప్రకటించిన కొద్దిరోజులకే మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి, ఆరుగురు ఒడిశా పోలీసులను బలిగొని, ఇరు రాష్ట్రాల పోలీసులకు సవాలు విసిరారు. ఒడిశాలోని కోరాపుట్- ఏపిలో సాలూరు మధ్య ఉన్న సుంకి వద్ద బుధవారం సాయంత్రం శక్తిమంతమైన మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఆరుగురు ఆర్మ్‌డ్ పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరిని గుర్తించాల్సి ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కోరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగర్‌గుమ్మ గ్రామం వద్ద ఓ కల్వర్టు వద్ద మావోయిస్టులు మందుపాతర అమర్చారు. ఇదే ప్రాంతం మీదుగా ఒడిశా ఆర్మ్‌డ్ పోలీసులు గత కొంతకాలంగా అంగుల్ పోలీస్ శిక్షణ కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం పోలీస్ శిక్షణా కేంద్రానికి ఒడిశా పోలీస్ వాహనంలో పోలీసులు బయల్దేరారు. వాహనం మొగర్‌గుమ్మ గ్రామ సమపంలోని కల్వర్ట్ వద్దకు రాగానే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఇడి)ని పేల్చారు. దీంతో పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు తునాతుకలైపోయి రోడ్డు నుంచి సుమారు 70 అడుగుల దూరానికి ఎగిరి పడింది. బస్సులో ఉన్న పోలీసులు బయటకు ఎగిరిపడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను సుంకి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వారిని కోరాపుట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. ఘటన జరిగిన సుమారు గంటకు ఒడిశా, ఎపీ పోలీసులు సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు. సుంకి-సాలూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతో ఇటు సాలూరు, అటు కోరాపుట్ వైపు నుంచి ప్రయాణించే వాహనాలు ఘటనా స్థలానికి ఇరువైపులా పెద్దయెత్తున నిలిచిపోయాయి.

చిత్రం... శక్తిమంతమైన మందుపాతర పేలిన ప్రదేశంలో దారుణంగా దెబ్బతిన్న రహదారి. పేలుడు ఘటనకు తునాతునకలైన పోలీసు వాహనం