ఆంధ్రప్రదేశ్‌

నన్ను నమ్మండి... న్యాయం చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 1: ముస్లింలారా నన్ను నమ్మండి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మీ భద్రత విషయంలో న్యాయం చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. త్వరలో ముస్లింల కోసం మరో 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న మైనార్టీ సంక్షేమ పథకాలపై బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీకి, ముస్లింలకు మధ్య ఉన్న అపోహలు తొలగించడానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడుతానని భరోసా ఇచ్చారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికే ఎన్‌డిఎతో పొత్తు పెట్టుకున్నానని, ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది నుంచే హజ్ యాత్రికులను విజయవాడ నుంచి జెడ్డా పంపడానికి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రచురితమైన ఎపి హజ్ బులెటిన్ పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా విడుదల చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని హామీ నిచ్చారు. కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ ప్రారంభించాం, కడపలో, విజయవాడలో హజ్ భవనాలు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. వక్ఫ్ బోర్డును పటిష్టపరచడమే కాదు, వక్ఫ్ ఆస్తుల్ని మైనార్టీల ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. మత సామరస్యానికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. వక్ఫ్ బోర్డు ద్వారా 24 కోట్లు విడుదల చేశారు. మొత్తం 5 వేల మంది ఇమాంలు, 5 వేల మంది వౌజన్‌లకు చెక్కులను అందజేయనున్నారు. మొదటి విడతగా రెండు వేల 500 మందికి ఇస్తున్నారు. రెండు విడతలో మరో రెండు వేల 500 మందికి గౌరవ భత్యం ఇస్తున్నామన్నారు. దేశ సమైక్యత, సమగ్రత, మతసామరస్యం కోసం ప్రార్థనలు చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ముస్లింలు ఘనంగా సత్కరించారు. గజమాల వేశారు. పచ్చటి టోపీ, పచ్చటి షేక్ దుస్తుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కనిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ షరీఫ్, శాసనసభ్యులు జలీల్ ఖాన్, చాంద్ బాషా, బొండా ఉమా, నెల్లూరు మేయర్ అజీజ్, ఏలూరు మేయర్ నూర్జహాన్, గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్ జానీమూన్, హజ్ కమిటీ ఛైర్మన్ మొమిన్ అహ్మద్ హుస్సేన్, ఎంఎఫ్‌సి ఛైర్మన్ ఎండి హిదాయత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్, మైనార్టీ కమిషనర్ మొహమ్మద్ ఇక్బాల్, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడలో ముస్లింల అవగాహన సదస్సులో సిఎం చంద్రబాబును
సత్కరిస్తున్న ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషా, ఇతర మైనారిటీ నేతలు