రాష్ట్రీయం

సామరస్యంతోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుదాం
* సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందాం
* ప్రతిపాదనలు ఇస్తే చర్చిద్దాం
* గవర్నర్ సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీ
* 9న మళ్లీ సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాష్ట్రా లు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుకునే విధంగా సమస్యలను పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో రాజ్‌భవన్‌లో బుధవారం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల బృందం సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లిన శాఖలకు కేటాయించిన కార్యాలయాలను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన చేయగా, షెడ్యూల్ 9,10 పరిధిలో ఉన్న సంస్థల విభజన త్వరగా జరగడానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఇరు రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను సమర్పిస్తే వాటిపై చర్చించి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని గవర్నర్ సూచించారు. ఎవరి వాదనలు వారు కాకుండా సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు ప్రతిపాదనలు సూచించాలన్నారు. ఇరు రాష్ట్రాలు చర్చించుకుంటే పరిష్కారమయ్యే అంశాలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని కేంద్రం పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రాల స్థాయిలో చర్చల ద్వారా పరిష్కారమయ్యే అంశాలపై మొదట దృష్టి సారించి ఆ తర్వాత కేంద్రం పరిధిలోని అంశాలపై చర్చించుకుంటే బాగుంటుందని ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. సమస్యలపై న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల జాప్యం జరుగుతుంది తప్ప పరిష్కారం కావన్న అభిప్రాయం వ్యక్తం అయింది. కృష్ణా జలాల పంపణీ వంటి కేంద్ర పరిధిలోని అంశాలపై ఉమ్మడిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కాగా ఇది తొలి సమావేశం కావడంతో స్పష్టమైన ప్రతిపాదనలతో రాలేదని, మరోసారి సమావేశమై పరపూర్ణంగా చర్చించిద్దామని ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల బృందం సూచించింది. దీంతో మరోసారి ఈ నెల 9వ తేదీన ఇరు రాష్ట్రాల ప్రతినిధులం భేటీ అవుదామని సమావేశంలో నిర్ణయించారు. అయితే మలి భేటీ హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో జరుపుదామని మంత్రి యనమల రామకృష్ణుడు సూచించగా, రెండుసార్లు హైదరాబాద్‌లో సమావేశం అయిన తర్వాత మూడవ భేటీని అమరావతిలో పెట్టుకుందామని తెలంగాణ మంత్రులు ప్రతిపాదించగా అంగీకారం కుదిరింది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ ఉద్యోగులు కొందరు కోర్టులకు వెళ్లడం వల్ల ఉద్యోగుల విభజన పెండింగ్‌లో పడిందని, దీని వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ ప్రస్తావించారు. రెండవ దఫా జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని రాజ్‌భవన్‌కు వచ్చి వినతి పత్రం సమర్పించిన విద్యుత్ ఉద్యోగులకు ఆయన హామీ ఇచ్చారు.

చిత్రం... రాజ్‌భవన్‌లో బుధవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల బృందం.