ఆంధ్రప్రదేశ్‌

దేశానికి కొత్త దిశానిర్దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాజకీయాల్లో సంస్కరణలకు శ్రీకారం
* క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపుతో రాజధాని రైతులకు మేలు
* నర్సరీలపై పన్ను సరికాదు
* రైల్వే జోన్, గిరిజన వర్సిటీపై వెనక్కి తగ్గేది లేదు
* కార్యరూపం దాలుస్తున్న డిజిటలైజేషన్ కమిటీ సిఫార్సులు
* మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీప్రవేశపెట్టిన బడ్జెట్ దేశానికి కొత్త దిశానిర్దేశం చేసేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్యాపిటల్ గెయిన్ టాక్స్ మినహాయింపుతో రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాజకీయాల్లో సంస్కరణలకు కూడా ఈ బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం మీడియా సమావేశంలో సిఎం మాట్లాడుతూ, దీర్ఘకాలంలో ఈ బడ్జెట్ వల్ల దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఇటువంటి బడ్జెట్‌ను రూపొందించిన ప్రధానికి, జైట్లీకి అభినందనలు తెలిపారు. రాజధాని నిర్మాణానికి తనపై నమ్మకంతో భూములిచ్చిన రైతులకు ఎప్పుడు అమ్ముకున్నా ఒకసారి క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు వర్తించేలా చూడాలని చెప్పారు.
రాజకీయాల్లో ప్రక్షాళనకు ఈ బడ్జెట్‌తో శ్రీకారం చుట్టారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం, ఒకేసారి ఎన్నికల నిర్వహణ వంటివి అవసరమన్నారు. ఎన్నికల నిర్వహణ సమయాన్ని కూడా తగ్గించాల్సి ఉందన్నారు. ఎన్నికల సంస్కరణలపై మరింత చర్చ జరిపి కొన్ని మార్పులు తీసుకువస్తే, ఆదర్శంగా ఉంటుందన్నారు.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటలైజేషన్‌పై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సిఫార్సులు కొన్నింటిని అమలు చేసే దిశగా బడ్జెట్‌లో పొందుపరిచారన్నారు. పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటు, ఆధార్ ఆధారిత చెల్లింపులు, పిఒఎస్ యంత్రాల కొనుగోళ్లు వంటివి డిజిటలైజేషన్‌కు ఉపయోగపడుతాయన్నారు. పన్నులు, వౌలిక సదుపాయాల కల్పన, రైల్వే, రహదారుల నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్రాల ప్రాతిపదిక కాకుండా కీలక రంగాల ప్రాతిపదికగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గృహ నిర్మాణానికి, పేదలు, నిరాదరణకు గురైన వర్గాల అభ్యున్నతికి కూడా ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
వెనక్కి తగ్గేది లేదు
ప్రత్యేక హోదా ప్యాకేజీకి చట్టబద్ధత, గిరిజన వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ, రైల్వే జోన్ గురించి పట్టువిడవకుండా ఒత్తిడి తీసుకువస్తున్నామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నర్సరీలపై పన్ను విధించడం సరికాదన్నారు. హార్టికల్చర్ పంటలు పన్ను వల్ల నష్టపోతాయన్నారు.
వివాదరహితంగా విభజన మేలు
రాష్ట్ర విభజన చట్టం కింద 9, 10 షెడ్యూల్లోని ఆస్తులను వివాద రహితంగా విభజించుకోవడం మేలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తొలి సమావేశం బుధవారం జరిగిందని, మరో సమావేశం 9న జరుగనుందన్నారు.