రాష్ట్రీయం

ఇక జీవిత ఖైదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2:యాసిడ్ దాడులకు పాల్పడే వారి పట్ల మరింత కఠిన వైఖరి అవలంబించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిందితులకు జీవిత ఖైదు విధించేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలన్న ప్రతిపాదనకు గురువారం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం యాసిడ్ దాడులకు పాల్పడే వారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు మాత్రమే చట్టం అవకాశం కల్పిస్తోంది. యాసిడ్ దాడులు జరిపి, అమాయకుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న నేరస్థులకు ఈ శిక్ష సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదుతోపాటు భారీగా జరిమానా విధించి, అలా వచ్చిన డబ్బును బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేసే విధంగా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నది ప్రభుత్వ యోచన.