రాష్ట్రీయం

కోలుకుంటున్న దాసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి2:తీవ్ర అస్వస్థకు గురై సికిందరాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్రమంగా కోలుకుంటున్నారు. దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ సిఇఓ బొల్లినేని భాస్కర్‌రావు గురువారం హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినప్పుడు డయాల్సిస్ చేశారు, అదే విధంగా వెంటిలెటర్ అమర్చారు. ఇప్పుడు డయాల్సిస్ అవసరం లేదని, వెంటిలెటర్ సపోర్ట్‌ను అప్పుడప్పుడు తొలగిస్తున్నారు. దాసరి క్రమంగా కోలుకుంటున్నారని, అయితే బలహీనంగా ఉన్నందున తిరిగి వెంటలెటర్ అమర్చుతున్నట్టు చెప్పారు.
సులభంగా శ్వాస తీసుకోవడానికి అవసరం అయిన ఆపరేషన్ చేసినట్టు తెలిపారు. నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. కిడ్నీలు పనిచేయని పరిస్థితిలో ఆస్పత్రిలో చేరారు. క్రమంగా ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతోందని కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్( కిమ్స్) సిఇఓ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు తెలిపారు.