రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల్లో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. తెలంగాణలో పూర్వ పది జిల్లాల్లో, ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతాయి. ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి కౌషల్ కేంద్ర పేరిట ఈ కేంద్రాలకు కేంద్రం ఆర్ధిక సాయం అందించనుంది. దేశవ్యాప్తంగా గుర్తించిన శిక్షణా కేంద్రాల్లో యువతకు ఈ రెండు పథకాల కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తారు. 35 రకాల శిక్షణను ఈ కేంద్రాల్లో అందిస్తారు. ఈ శిక్షణ పొందిన యువత 221 రకాల ఉద్యోగాలకు అర్హులవుతారు. గత ఏడాది నవంబర్ వరకూ ఈ పథకాల కింద 19.84 లక్షల మంది శిక్షణ పొందారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే రూ.94.74 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా 441 జిల్లాల్లో 458 కౌషల్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే 13వేల పాలిటెక్నిక్ ప్రభుత్వ కాలేజీలను అనుసంధానం చేసి వాటి ద్వారా కూడా ప్రత్యేక నైపుణ్యాల శిక్షణను అందిస్తారు. 2017-22 మధ్య ఆంధ్రాకు 11.9 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని ఇప్పటికే ఎన్‌స్‌డిసి అంచనా వేసింది.