తెలంగాణ

పజీవోల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: గ్రేటర్ హైదరాబాద్‌లో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వపరంగా ప్రజలను ఆకట్టుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు పార్టీ పరంగా నాయకులు నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే మరోవైపు ప్రభుత్వ పరంగా వరాలు కురిపిస్తూ వాటి అమలుకు అవసరం అయిన జీవోలు విడుదల చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడడానికి ముందే వరాల అమలుకు జీవోలు విడుదల చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి పలు వరాలు ప్రకటించగా, వాటికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటి పన్ను మాఫీ, నగరంలో రియల్ ఎస్టేట్‌కు అభివృద్ధి, భవనాల నిర్మాణానికి అనుమతుల్లో రాయితీల వంటి పలు అంశాలపై జీవోలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ దాహాన్ని తీర్చే కీలక ప్రాజెక్టులకు ఉత్తర్వులు ఇచ్చారు. 7600 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి అనుమతి ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రధానంగా నీటి సమస్యను తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మంజీరాలపై ఎక్కువగా ఆధారపడలేని పరిస్థితి ఏర్పడడంతో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ వాటర్ ఇండియా ఈ ప్రాజెక్టుకు అవసరమైన రుణం ఇస్తోంది. శామీర్ పేట మండలంలో 20 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు. అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద మరో రిజర్వాయర్ నిర్మిస్తారు. 12వందల రూపాయల వరకు ఉన్న ఇంటి పన్నును 101 రూపాయలకు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అపార్ట్‌మెంట్స్, ఇళ్లకు పనె్నండు వందల రూపాయల వరకు పన్ను చెల్లిస్తున్న వారు ఇకపై 101 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇంతకు ముందు బకాయిలు ఉన్నవి రద్దయినట్టే, ఇప్పటి నుంచి 101 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు రెండు జీవోలు వేర్వేరుగా విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్‌కు ఊతం ఇచ్చేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు కమిటీ వేశారు. వంద యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారికి విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ప్రభత్వుం ఇంతకు ముందే ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 151 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.

ఏఇఇల నియామకంపై
హైకోర్టు స్టే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ పవర్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఎగ్జికూటివ్ ఇంజనీర్ల ఎంపికపై చీఫ్ జస్టిస్ దిలీప్ బి భోంస్లే, ఎస్‌వి భట్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ జనవరి 20వరకూ స్టే విధించింది. తెలంగాణకు చెందిన వారికి మాత్రమే ఉద్యోగాలు లభించే విధంగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్, టిఎస్ ఎన్‌పిడిసిఎల్ , జెన్‌కో,ట్రాన్స్‌కో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయని చల్లా నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని రెండు జోన్లలో నివసించే వారు, ఆరేళ్లకు పైగా సంబంధిత జోన్‌లో చదువుకున్న వారిని స్థానికులుగా, గుర్తిస్తూ నియామకానికి నిబంధనలు విధించారని, పిటీషనర్ తరఫున్యాయవాది డాక్టర్ కె లక్ష్మీ నరసింహా తెలిపారు. స్థానికులకు 70 శాతం, స్థానికేతరులకు 30 శాతం పోస్టులు రిజర్వ్ చేశారని తెలిపారు. కంపెనీ యాక్ట్ కింద రిజస్టర్ అయిన వాటికి లోకల్ నిబంధనలు వర్తించవని తెలిపారు. రాష్టప్రతి ఉత్తర్వులు విద్యుత్ సంస్థలకు వర్తించవని వాదించారు. మార్చిన నియమ నిబంధనలు వంద శాతం తెలంగాణకు చెందిన వారికే ఉద్యోగాలు లభించే విధంగా ఉన్నాయా? అని అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావును బెంచ్ ప్రశ్నించింది. ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారమే రిజర్వేషన్ల విధానం రూపొందించినట్టు రామచంద్రరావు తెలిపారు. రిక్రూట్‌మెంట్ గురించి బెంచ్ వివరాలు కోరగా, రాత పరీక్ష పూర్తయిందని, ఫలితాలు ప్రకటించాల్సి ఉందని పవర్ కార్పొరేషన్ తరఫున హాజరైన న్యాయవాది జి విద్యాసాగర్ తెలిపారు. జనవరి 20కి కేసు వాయిదా వేస్తూ, అప్పటివరకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయవద్దని ఆదేశించారు.
పేదల బియ్యం పేదలకే
మంత్రి ఈటల రాజేందర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 5: పేదలకు చెందాల్సిన నిత్యావసర వస్తువులు బ్రోకర్ల చేతికి అందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జార్ఖండ్ పౌర సరఫరాల శాఖ మంథ్రి సూర్యరాయ్ సచివాలయంలో మంగళవారం ఈటల రాజేందర్‌ను కలిశారు. ఆహార భద్రత చట్టంను రాష్ట్రంలో అమలు చేస్తున్న తీరు గురించి ఈటల వివరించారు. కేంద్ర జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1.92 కోట్ల మంది ప్రజలను మాత్రమే పరిగణలోకి తీసుకోగా, తాము 2.82 కోట్ల మంది ప్రజలకు అమలు చేస్తున్నామని ఈటల తెలిపారు. తెలంగాణ పౌర సరఫరా శాఖ సబ్సిడీ పథకానికి 3500 కోట్ల రూపాయలు వ్యయం చేస్తోందని మంత్రి తెలిపారు. తెలంగాణలో పౌర సరఫరాల శాఖ పనితీరును జార్ఖండ్ మంత్రి అభినందించారు.
‘ఔట్‌సోర్సింగ్’ వేతనం మాకూ ఇవ్వండి
మున్సిపల్ కార్మికుల వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 5: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన వేతనం తమకు కూడా అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని, ఆలోపు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పెంచిన వేతనాలు తమకు కూడా మంజూరు చేయాలని కోరారు. గతంలో 8, 9వ పిఆర్‌సిల అమలు సందర్భంగా పర్మినెంట్ ఉద్యోగి కనీస బేసిక్‌ను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింప చేసేవారని, కానీ 10వ పిఆర్‌సిలో రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సిలో నిర్ణయించిన 13 వేల కనీస వేతనం కాకుండా రూ.12,500గా నిర్ణయించారని యూనియన్ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.

షహర్ హమారా...
మేయర్ హమారా
టిటిడిపి అధ్యక్షుడు రమణ ధీమా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 5: షహర్ హమారా...మేయర్ హమారా నినాదంతో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు, టిడిపి హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ నెల 9న నగరంలోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. షహర్ హమారా..మేయర్ హమారా..అమన్ శాంతి అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన చెప్పారు. గతంలో టిడిపి-బిజెపి కలిసి పోటీ చేసి ఎంసిహెచ్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేయర్ స్థానానికి పరోక్ష ఎన్నికలు నిర్వహించారని ఆయన చెప్పారు. ఇప్పుడు టిఆర్‌ఎస్ కూడా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం సాదించేందుకు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు.టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం ఏర్పాటు చేసి నగరాభివృద్ధి గురించి చర్చించారు కానీ, ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు.

రేవంత్‌పై టి.అడ్వకేట్స్ ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత రేవంత్ రెడ్డిపై జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌లో తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఫిర్యాదు చేసింది. మంత్రి తారక రామారావును కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ పత్రికల్లో ప్రకటనలు చేశారని టి.న్యాయవాదులు జేఎసి ఆరోపించింది. మంత్రి కెటిఆర్‌పై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అనైతికమని, ఇలాంటి చౌకబారు ప్రకటనలు మానుకోవాలని టి.జెఎసి సూచించింది.