రాష్ట్రీయం

చిత్తూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట/జీడిమెట్ల, ఫిబ్రవరి 2: స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి కారులో వస్తున్న భక్తులను రేణిగుంటలో లారీ రూపంలో మృత్యువు కబళించింది. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రేణిగుంట మండలం వెదళ్లచెరువు వద్ద లారీని ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు మృత్యువుతో పోరాడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రేమ సుందర్ రెడ్డి(36) ఎల్ ఎన్ టి టర్బ్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అతని స్నేహితులు కిషన్ రెడ్డి (38), శ్రీనివాసులు రెడ్డి(40) జీడిమెట్లలో ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరు తమ స్నేహితులు కుత్బుల్లాపూర్‌కు చెందిన హనుమంతరెడ్డి (41), తిరుప్పాల్ రెడ్డి(39)తో కలిసి బుధవారం రాత్రి కారులో బయలుదేరారు. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రేణిగుంట మండలం వెద్దలచెరువు వద్ద కారు ప్రయాణిస్తున్న సమయంలో ముందువెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన సమయంలో ఎదురుగా వస్తున్న లారీని అతివేగంగా ఢీకొన్నారు. ఈసంఘటనలో కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఘటనలో కారు నుజ్జునుజ్జయి కారునడుపుతున్న ప్రేమసుందర్‌రెడ్డి, పక్కన కూర్చొన్న కిషన్ రెడ్డి అతని వెనుక సీట్లో కూర్చొని ఉన్న శ్రీనివాసులురెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీటులో కూర్చొని తీవ్రంగా గాయపడ్డ హనుమంతరెడ్డి, తిరుపాల్‌రెడ్డి అతికష్టం మీద కారుకు మరోవైపు ఉన్న డోరునుంచి బయటపడి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జు అయిపోవడంతో మృతదేహాలు పూర్తిగా కారులో కూరుకుపోయాయి. ఇదిలావుండగా మామిడి తోటకు ట్రాక్టర్‌తో పురుగుమందు పిచికారి చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పాకాల మండలం పదిబట్లబైలు గ్రామంలో గురువారం జరిగింది.