రాష్ట్రీయం

హోదాతో రాయితీలు హుళక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 3:ప్రత్యేక హోదాకు, పరిశ్రమలకు ఎలాంటి సంబంధం లేదని, పరిశ్రమలు వస్తే ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు ఉండవని, హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉన్నాయన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే తమ ముఖ్య ఉద్దేశమని, ఇందుకోసం పరిశ్రమల ఏర్పాటుకు ఇతోధిక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేసిన గమేస గాలిమరల రెక్కల తయారీ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోదా పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్1-బి వీసాలు నిలిపివేస్తామని ప్రకటించడంతో భారతీయులు ఇబ్బందులుపడే పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగాల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తీసివేయడం సరికాదని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలన్నారు. ఇలాంటి సమయంలో మన ప్రాంతంలో మన ఉద్యోగాలు సృష్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రానున్న పది సంవత్సరాల కాలంలో 65 కోట్ల రూపాయలు పెట్టుబడితో 12 వేల మెగావాట్ల విద్యుత్ సాధించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది వ్యాపార విస్తరణలో గుజరాత్ మొదటిస్థానంలోనూ, ఆంధ్రా రెండో స్థానంలో ఉండేదని, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చిందని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన రెండో భాగస్వామ్య సదస్సులో 655 అవగాహన ఒప్పందాలు జరిగాయని వీటి ద్వారా పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సిఎం చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు విషయంలో అపోలో టైర్లు, హిందుస్థాన్ సియోట్, టాటా, హెచ్‌సిఎల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుతో 175 కంపెనీలతో అవగాహన ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు. సిఆర్‌డిఎ పరిధిలో లక్షా 20 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, టెక్స్‌టైల్స్, టూరిజం వంటి ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. స్పెషల్ క్యాటగిరి వల్ల పరిశ్రమలు, ఇన్‌సెంటివ్స్ ఉన్నందున ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపామని ఆయన అన్నారు. గత రెండున్నరేళ్లలో నెల్లూరు జిల్లాకు సంబంధించి 16 పెద్ద పరిశ్రమల ద్వారా 13,396 కోట్ల పెట్టుబడితో 20 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
గమేస కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ కైమల్ మాట్లాడుతూ స్థలం విషయంలోనూ, పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, పి నారాయణ, ఎపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య, రాష్ట్ర వౌలిక వసతుల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద ఏర్పాటుచేసిన గమేసా కంపెనీని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు