రాష్ట్రీయం

కొత్త లైన్లకు రూ.887 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యతే లభించినట్టు ఎస్సీఆర్ జిఎం వినోద్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు 3,034 కోట్లు, కొత్త రైలు మార్గాలకు 887 కోట్లు, డబ్లింగ్ పనులకు 436 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు శుక్రవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వౌలిక సదుపాయాలకు గత ఏడాది 2134 కోట్లు కేటాయించారని, ఈ ఏడాది 42శాతం అధికంగా కేటాయింపులు జరిగాయన్నారు. కొత్త రైల్వే మార్గాల ఏర్పాటుకు గత ఏడాది 760 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 17శాతం అధికంగా కేటాయించినట్టు వివరించారు. ఆంధ్ర, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్‌ల ఏర్పాటుకు రు.19 కోట్లు కేటాయించినట్టు యాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణకు..: యాదాద్రి- ఘట్‌కేసర్ ఎంఎంటిఎస్ రైలు విస్తరణ (రెండో దశ)కు అదనంగా రు.16 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని, మంచిర్యాల- పెద్దపల్లి మూడో లైన్‌కు రు.100 కోట్లు, సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ డబ్లింగ్‌కు రు.50 కోట్లు, పెద్దపల్లి- కరీంనగర్- నిజామాబాద్ కొత్త రైల్వే లైన్‌కు రు.25 కోట్లు, మునీరాబాద్- మహబూబ్‌నగర్ రైల్వే లైన్‌కు రు.300 కోట్లు, వౌలాలి వద్ద ఈఎంయూ కార్‌షెడ్‌కు రు.5.86 కోట్లు, అక్కన్నపేట- మెదక్ రైల్వే లైన్‌కు రు.196 కోట్లు కేటాయించారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు: విజయవాడ- అమరావతి- గుంటూరు లైన్‌కు రు.2,680 కోట్లు, రాజమండ్రి యార్డు అభివృద్ధికి రు.27.2 కోట్లు, విజయవాడ- గుడివాడ లైన్‌ను మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించేందుకు రు.130 కోట్లు, గుంటూరు- తెనాలి రైల్వే లైన్ డబ్లింగ్‌కు రు.36 కోట్లు, కాజిపేట- గుడివాడ మూడో లైన్‌కు రు.100 కోట్లు, విజయవాడ- గూడూరు మూడో లైన్‌కు రు.100 కోట్లు, తిరుపతిలో విశ్రాంతి గదుల నిర్మాణానికి రు.7 కోట్లు, గూడూరు వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రు.2.7 కోట్లు, విజయవాడ- నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగ్‌కు రు.122 కోట్లు, గుత్తి- ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్‌కు రు.75 కోట్లు, జగ్గయ్యపేట- మేళ్ళచెరువు- జాన్‌పహాడ్ మార్గానికి రు.79 కోట్లు, విజయవాడ- కాజీపేట, రేణిగుంట, గుత్తి బైపాస్‌లకు రు.135 కోట్లు, కాకినాడ- పిఠాపురం రైల్వే మార్గానికి రు.150 కోట్లు, ఓబులాపురం- కృష్ణపట్నం రైల్వే లైన్‌కు రు.100 కోట్లు, గుంతకల్- కల్లూరు రైల్వే లైన్ డబ్లింగ్‌కు రు.52 కోట్ల కేటాయించినట్టు ఆయన చెప్పారు.
సర్వేలకు లైన్ క్లియర్
బొల్లారం- ముకుంద్ మధ్య 235 కి.మీ రైల్వే లైన్ డబ్లింగ్ సర్వేకు అనుమతిచ్చినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా కాజీపేట- బలార్షా మధ్య (234కి.మీ) నాలుగో లైన్ సర్వే, కాజీపేట- విజయవాడ మధ్య (219 కి.మీ) నాలుగో లైన్ సర్వే, హిందూపురం- చిత్రదుర్గ మధ్య కొత్త రైల్వే లైన్, కొండపల్లి- కిరండోల్ మధ్య నూతన రైల్వే లైన్ సర్వే, మంత్రాలయం- కర్నూలు మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే చేసేందుకు అనుమతించినట్టు జనరల్ మేనేజర్ తెలిపారు.
భద్రతాచర్యల్లో భాగంగా..
భద్రతా చర్యల్లో భాగంగా రోడ్లు ఓవర్ బ్రిడ్జిలకు, రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి 325.4 కోట్లు కేంద్రం గ్రాంట్‌గా కేటాయించిందని ఆయన చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో ట్రాఫిక్ సౌకర్యాలకు రు.96.1 కోట్లు, ప్రయాణికుల అవసరాలకు రు.67.8 కోట్లు కేటాయించినట్టు జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్- విజయవాడ లైన్ పునర్నిర్మాణ పనులు 8న ప్రారంభించనున్నట్టు చెప్పారు.
అవినీతి ఫిర్యాదులు రాలేదు..
రైల్వేలో అవినీతిపై తనకు ఫిర్యాదులేవీ రాలేదని జిఎం మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంఎంటిఎస్‌ను శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వరకూ తీసుకెళ్ళే విషయంలో జిఎంఆర్‌తో మాట్లాడుతున్నట్టు చెప్పారు.