తెలంగాణ

మద్యం షాపుల నుంచి సర్వీసు టాక్స్ వసూలుపై ఇరు రాష్ట్రాల్లో హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మద్యం షాపుల నుంచి 15 శాతం సర్వీసు టాక్స్ వసూలు చేయాలని సెంట్రల్ ఎక్సైజు బోర్టు అండ్ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిలుపుదల చేస్తూ హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. తమ నుంచి సర్వీసు టాక్స్ వసూలు చేయాలన్న ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇరు రాష్ట్రాలకు చెందిన మద్యం షాపుల యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మద్యం షాపుల నుంచి సర్వీసు టాక్స్ వసూలు చేయరాదని సెంట్రల్ ఎక్సైజు అండ్ కస్టమ్స్‌శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆదాయ పన్ను రిటర్నస్ దాఖలు చేయకుండా సర్వీసు టాక్స్ ఎలా వసూలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.