రాష్ట్రీయం

అందరూ సుభిక్షంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులు పెద్ద సంఖ్యలో శారదాపీఠాన్ని సందర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి, స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా ఉదయం 9 గంటలకు గణపతి పూజతో వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ధనూరాశిలో శని ప్రవేశంతో భారతదేశానికి ప్రాప్తించిన శని దోష నివారణకు శ్రీ వనదుర్గకు కుంభాభిషేకం ప్రారంభించారు. చతుర్వేద సంహిత వనదుర్గాదేవి యాగాన్ని నాలుగు వేదాల్లో నిష్ణాతులైన పండితులు ప్రారంభించారు. రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, తెలంగాణ హోం మంత్రి నాయని నర్శింహారెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తూ పాలకులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ, దేశంపై ఏలినాటి శని ప్రభావం పడకుండా ఉండేందుకు అన్ని గ్రహాలకు అధిదేవత వనదుర్గ మాతకు మహాకుంభాషిషేకం నిర్వహిస్తున్నట్టు స్వరూపానంద స్వామి తెలిపారు. భారత జాతి సర్వసుభిక్షంగా ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని, ప్రకృతి పరంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని కోరుతూ నవ గ్రహ దేవత వనదుర్గకు హోమం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వాధినేతలు మంచి పాలన అందిస్తున్నప్పటికీ భగవంతుని అనుగ్రహం కోసం ఇటువంటి వేద కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయన్నారు.
తెలంగాణ హోం మంత్రి నాయని నర్శింహారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మంచి జరిగేందుకు స్వామీజీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని కాంక్షించారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందుకు భగవంతుని అనుగ్రహం తప్పనిసరని అన్నారు. ఎపి అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ధర్మోరక్షతి రక్షితః నానుడి ధర్మ రక్షణకు ప్రేరణ కల్పిస్తుందన్నారు. శనికీడు ప్రభావం నుంచి దేశాన్ని, రెండు తెలుగు రాష్ట్రాలను కాపాడేందుకు స్వామీజీ తలపెట్టిన వనదుర్గ హోమం మంచి ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. టిడిపి అధ్యక్షుడు కె కళావెంకటరావు మాట్లాడుతూ శాస్త్ర ధర్మాన్ని పాటిస్తూ దేశానికి మంచి జరగాలన్న లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నారు. లోకకల్యాణార్ధం జరుగుతున్న కార్యక్రమానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ జరిగింది.

చిత్రం.. భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తున్న విశాఖ శారదాపీఠాధిపతి
స్వరూపానందేంద్ర సరస్వతి. చిత్రంలో తెలంగాణ మంత్రి నాయని నర్సింహారెడ్డి,
ఏపి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఉన్నారు