ఆంధ్రప్రదేశ్‌

హంతకుడు దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 4: వరుస హత్యలకు పాల్పడుతూ భయోత్పాతం సృష్టిస్తున్న కరడుగట్టిన నేరగాడు మధుకర్‌రెడ్డి (32)ని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తంబళ్ళపల్లి మండలం దిగువపల్లెకు చెందిన మధుకర్‌రెడ్డి నాలుగు హత్యకేసుల్లోనూ, పలు దోపిడీ కేసుల్లోనూ నిందితుడు. స్వగ్రామంలోనే ఒక హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ, గతంలో పోలీసుల కన్నుగప్పి పారిపోయాడు. అన్నిటికీమించి 2013లో బెంగళూరులో ఏటిఎంనుంచి డబ్బు డ్రా చేస్తున్న ఓ మహిళపై కత్తితో దాడి చేసి, డబ్బు కాజేసిన కేసులోనూ ఇతనే నిందితుడు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేకెత్తించింది. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ కథనం మేరకు దిగువ పల్లెకి చెందిన మధుకర్‌రెడ్డి 2005లో రెడ్డివారి ఆనందరెడ్డి అనే వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ, 2011లో పోలీసుల కన్నుగప్పి పారిపోయాడు. ఇక అక్కడినుంచి నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు. 2013 నవంబర్ 9న జడ్చర్ల వద్ద బారులో నారాయణ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి నగదుతో అనంతపురం జిల్లా ధర్మవరానికి పారిపోయాడు, అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళను హత్య చేసి నగలు, బీరువాలో ఉన్న ఎటిఎం కార్డును తీసుకొని బెంగళూరుకు చేరుకున్నాడు. అదే నెల 19న బెంగళూరులోని ఎల్‌ఐసి ఆఫీసు వద్ద ఏటిఎంలో ఒంటరిగా డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళను చూసి, ఎటిఎంలోకి చొరబడి ఆమెను కత్తితో గాయపరిచి డబ్బుతో ఉడాయించాడు. అప్పట్లో ఈ దృశ్యం సిసి కెమెరాల ద్వారా వెలుగులోకి రావడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ కేసులో నిందితుణ్ని పట్టించిన వారికి 11 లక్షల నగదు రివార్డును కూడా కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కొంతకాలం కిందట చిత్తూరు జిల్లా పీలేరులో ఓ మహిళను కత్తితో గాయపరిచి, నగలు, డబ్బు కాజేసి పారిపోయాడు. తాజాగా హైదరాబాద్‌నుంచి మదనపల్లి వస్తుండగా మధుకర్‌రెడ్డిని అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు.

చిత్రం... హంతకుడు మధుకర్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెడుతున్న పోలీసులు