తెలంగాణ

అన్ని ఆలయాలకు ‘ప్రత్యేక పూజానిధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణలోని అన్ని దేవాలయాలకు విడివిడిగా ‘ప్రత్యేక పూజా నిధి’ని ఏర్పాటు చేయాలని దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ ఎం.వి.సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డికి శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు రోజువారీ పూజకు కూడా నిధులు లేక ఇక్కట్లకు గురవుతున్నాయని గుర్తుచేశారు.
ఆదాయంలేని ప్రతి దేవాలయం పేరుతో ‘డైలీ పూజా ఫండ్ అకౌంట్’ ప్రారంభించేందుకు దేవాదాయ కమిషనర్ చొరవ చూపాలంటూ సుప్రీంకోర్టు 1997లోనే సూచించిందని గుర్తు చేశారు. ఈ సూచనకు అనుగుణంగా చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రత్యేక అకౌంట్ ప్రారంభించామని, భక్తుల నుండి నిధులు లభిస్తున్నాయన్నారు. ఈ నిధులను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై లభించే వడ్డీతో రోజువారీ పూజలు కొనసాగిస్తున్నామని సౌందరరాజన్ గుర్తు చేశారు. ఈ విషయంలో రాష్టవ్య్రాప్తంగా భక్తుల్లో చైతన్యం కల్పించాలని సౌందరరాజన్ దేవాదాయ మంత్రిని కోరారు.