రాష్ట్రీయం

నేటినుంచే బయో ఆసియా సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5:ప్రతిష్ఠాత్మకమైన బయో ఆసియా సదస్సు హైదరాబాద్ హైటెక్స్‌లో సోమవారం ప్రారంభం కాబోతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో 50కి పైగా ఆసియా దేశాలకు చెందిన ఔషధ, ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్ర రంగాలకు చెందిన 1500మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం తొలి రోజు సదస్సును గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి విజేత ప్రొఫెసర్ కర్ట్ ఉత్రిచంద్‌కు, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ అధికారి పాల్ స్టోఫెల్స్‌కు జెనోమ్ వాలీ ఎక్సలెన్స్ అవార్డులను గవర్నర్ బహూకరిస్తారు. వ్యాపార అవకాశాల విస్తత్రి, విస్తరిస్తున్న వ్యాధుల నివారణలో సరికొత్త చికిత్సా విధానాలు, పరిశోధన రంగంలో నూతన ఆవిష్కరణలపై మూడు రోజుల్లో వివరణాత్మక చర్చలు జరగనున్నాయి. ఔషధాల తయారీలోనూ, ఆరోగ్య సంరక్షణ రంగంలోనూ వస్తున్న వినూత్నమైన మార్పులపై కూడా విశే్లషణాత్మక చర్చలు జరుగుతాయి. 50 దేశాలనుండి 600 కార్పొరేట్ సంస్థలు పాల్గొంటున్న ఈ సదస్సులో 100 మందికిపైగా వైద్య రంగ నిపుణులు విశే్లషణాత్మక నివేదికలు సమర్పిస్తారు.
ఈ సందర్భంగా హెచ్‌ఐసిసిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్‌లో 100 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీలు, నోవార్టీస్, హెటెరో, జివికె బయోటెక్, అరవిందో తదితర ఔషధ సంస్థలు ఈ సదస్సును స్పాన్సర్ చేస్తున్నాయి.