తెలంగాణ

ఎస్సీ వర్గీకరణకు యుపి ఎన్నికల దెబ్బ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అఖిలపక్ష బృందానికి అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయడం వెనుక ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్ష బృందానికి ప్రధానమంత్రి ఎలాంటి హామీ ఇచ్చినా, చివరకు వినతిపత్రం స్వీకరించి పరిశీలిస్తానని చెప్పినా బిఎస్‌పి నేత మాయావతి దీన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటారని పార్టీ వర్గాలు హెచ్చరించడంతో ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసినట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణ అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధా న రాజకీయ అంశంగా మారింది. ఆంధ్రలో మాల వర్గీయులు ఎక్కువగా ఉండగా, తెలంగాణలో మాదిగ వర్గీయులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్‌పిఎస్ ఉద్యమం ప్రారంభం అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంఆర్‌పిఎస్ నుంచి తప్ప దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వర్గీకరణకోసం పెద్దగా డిమాండ్లు వినిపించడం లేదు. వర్గీకరణపై ప్రధానమంత్రి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇది బిఎస్‌పి ప్రచార అంశంగా మారుతుందని బిజెపి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో ఆరవ తేదీన అఖిలపక్ష బృందాన్ని కలువాల్సి ఉండగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.