తెలంగాణ

కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఐఎన్‌టియుసి కార్యకర్త కృషి చేయాలని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఐఎన్‌టియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం ఆదివారం డాక్టర్ జిఎస్‌ఆర్ ఐఎన్‌టియుసి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఐఎన్‌టియుసి నేతలతో చర్చించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ నేతలు జనక్‌ప్రసాద్, ఆర్.ప్రకాశ్‌గౌడ్, ఆదిల్ షరీఫ్, ఆర్‌డి చంద్రశేఖర్, వి.్భస్కర్‌రెడ్డి, వై.నారాయణగౌడ్, ఉమా, ఉష తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డిని సన్మానిస్తున్న ఐఎన్‌టియుసి నేతలు