రాష్ట్రీయం

ఐక్య ఉద్యమాలతో కెసిఆర్‌ను గద్దె దింపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 5: సామాజిక న్యాయం అమలుకాకపోతే ఎర్రజెండాలన్నీ కలిసి ఉద్యమించి ప్రజల మద్దతుతో కెసిఆర్‌ను గద్దె దింపుతామని, ఇందులో కలిసివచ్చే పార్టీలు, సంఘాలను కలుపుకుంటామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ‘మహాజన పాదయాత్ర’లో ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాటు కెసిఆర్ కుటుంబ పాలన సాగించారని, మిగిలిన కాలంలో అయినా పాలనలో మార్పు తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించడం తథ్యమన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారనే విషయం పాదయాత్రలో తమకు అందుతున్న విజ్ఞాపనలే చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల వర్గాల ప్రజలే ఉన్నారన్నారు. వారి బతుకుల్లో వెలుగులు తేకుండా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్-వన్ అనుకోవడం భ్రమేనని అన్నారు. ఆస్తి, అంతస్తు, రాజకీయ పదవులు ప్రస్తుతం కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు. దళితులు, గిరిజనులకు ఇస్తామన్న భూమి ఇవ్వకపోగా ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో రాష్ట్రంలో 5లక్షల ఎకరాల భూమిని దళిత, గిరిజన రైతుల నుంచి లాక్కున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని విమర్శించారు. రైతుల వద్ద తీసుకున్న భూములకు చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించడం లేదని అన్నారు. బిసి సబ్‌ప్లాన్ చట్టం తీసుకురాకుండా బిసిలు ఎలా బాగుపడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జిల్లాల విభజన అశాస్ర్తియంగా జరిగిందన్నారు. పరిశ్రమల పేరిట నిరుపేదల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే రాష్ట్రంలోని అట్టడుగు కులాలు అభివృద్ధి చెందుతాయని అనుకున్నప్పటికి కెసిఆర్ ఆ దిశగా అభివృద్ధి చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం విద్య, వైద్యం, ఇల్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం మహాజన పాదయాత్ర చేపట్టిందని చెప్పారు. 112 రోజులుగా రాష్ట్రంలోని అనేక మండలాలు, గ్రామాల్లో పర్యటించామని, టిఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో సైతం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారన్నారు. మార్చి 19న పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని, ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని తమ్మినేని పిలుపిచ్చారు.