రాష్ట్రీయం

వారంముందే ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కాకినాడ, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్-2016 నిర్వహణ తేదీని మార్చింది. ఈమేరకు ఉన్నత విద్యామండలి నుండి ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాకినాడ జెఎన్‌టియుకు ఉత్తర్వులు అందాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఎంసెంట్- 2016ను ఈ ఏడాది మే 5న నిర్వహించాల్సి ఉంది. ఐతే ఆ తేదీని ముందుకు జరిపి, ఏప్రిల్ 29న నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లక్కసాని వేణుగోపాలరెడ్డి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు 2015 డిసెంబర్ 21న ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంసెట్‌ను 2016 మే 5న నిర్వహించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ఏటా నిర్వహించే కెసెట్‌ను 2016 మే 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వ కెసెట్- 2016 తేదీలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల సౌకర్యార్ధం 2016 మే 5వ తేదీన ఎపి ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా కర్నాటక ప్రభుత్వం మరో ప్రకటన చేస్తూ 2016 మే 4,5 తేదీలలో కెసెట్-2016ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దీంతో ఎపి ఉన్నత విద్యామండలి డోలాయమానంలో పడింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే కెసెట్‌కు వెళ్ళే అవకాశాలను పరిగణలోకి తీసుకుని, పరీక్ష తేదీని మార్చాలని నిర్ణయించారు. ఈమేరకు ఉన్నత విద్యా మండలి అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు సమావేశమై ఏప్రిల్ 29న ఎపి ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు. దీంతో అనుకున్న తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఎపి ఎంసెట్‌కు విద్యార్థులు హాజరుకావల్సి ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎపి ఎంసెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను సంక్రాంతి పండుగ అనంతరం చేపట్టనున్నట్టు కన్వీనర్ డాక్టర్ సాయిబాబు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. ఎంసెట్‌కు సంబంధించి అంతర్గత పనులు ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలిపారు. కాగా ఎపి ఎంసెట్-2015ను జెఎన్‌టియుకె సమర్ధవంతంగా నిర్వహించింది. ఈ కారణంగానే మళ్ళీ జెఎన్‌టియుకెకు ఈ అవకాశం దక్కింది. గతేడాది ఎంసెట్-2015గా జెఎన్‌టియుకె వీసీ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్‌గా డాక్టర్ సిహెచ్ సాయిబాబా వ్యవహరించారు.