రాష్ట్రీయం

మా పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 6:హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందించేంత వరకు పోరాటం ఆపేది లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే రెండు నెలల్లోనే సాగునీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం నిర్వహించిన మహాధర్నాలో రైతులు, ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కరవు తీరి సస్యశ్యామలంగా ఉండేవని అన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి, వెలిగొండ, పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. అయితే వాటిని తానే చేసినట్లుగా ముఖ్యమంత్రి చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాను ఆదుకోవాలంటే హంద్రీ నీవా ఒక్కటే శరణ్యమన్నారు. శ్రీశైలం నుంచి 40 టిఎంసిల నీటిని అందించే ఏకైక ప్రాజెక్టు ఇదొక్కటేనన్నారు. రూ.6,800 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్నపుడు రూ.4వేల కోట్లు వెచ్చించారన్నారు. ఈ నిధులతో హంద్రీ నీవా పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబు జాప్యం చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందేదని, 10 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగి ఉండేదన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ప్రాజెక్టులపై రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కిలోమీటరు కాలువ తవ్వలేదని, ఒక్క డిస్ట్రిబ్యూటరీ కూడా ఏర్పాటు చేయలేదని, ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదని విరుచుకుపడ్డారు. 2012 ఫిబ్రవరి 19న అప్పటి సిఎం కిరణ్‌కుమార్ హంద్రీ నీవాకు శంకుస్థాపన చేశారని, అయితే అది మరచిన చంద్రబాబు మళ్లీ రిబ్బన్ కట్ చేశారన్నారు. ప్రాజెక్టులు కట్టినోళ్లు గొప్పోళ్లా, ప్రాజెక్టుకు గేట్లు ఎత్తినోళ్లు గొప్పోళ్లా అని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు పిహెచ్‌డి తీసుకున్నారని జగన్ ఆరోపించారు. బొంకడంలో ఆయనకన్నా నాలుగు రెట్లు అధికంగా జల వనరుల మంత్రి పిహెచ్‌డిలు పొందారని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ సమయంలో వైఎస్‌ఆర్ జిఓ ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉమా అప్పట్లో ధర్నా చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని జల వనరులశాఖ మంత్రిని చేశారని విమర్శించారు. పులిచింతల పునరావాసం కింద రూ.125 కోట్లు ఇచ్చి ఉంటే ఇపుడు 125 టిఎంసిల నీరు నిల్వ చేసే వీలుండేదన్నారు. నమ్మే వాళ్లుంటే హంద్రీ నీవా ద్వారా శ్రీకాకుళానికి, గాలేరు-నగరి నుంచి ఆఫ్రికాకు, అక్కడి నుంచి అమెరికాకు కూడా నీళ్లిస్తానంటారని ఎద్దేవా చేశారు. బలహీనంగా ఉంటే పిఎం మోదీతో ఢీ అంటారు, లేకుంటే కాళ్లు పట్టుకుంటారు. అలాగే తెలంగాణ సిఎం కేసిఆర్‌తో అందితే జట్టు లేకుంటే కాళ్లు పట్టుకుంటారు.. ఆయన కృష్ణాజలాలు తరలించుకు పోతుంటే అడిగే ధైర్యం లేదే చంద్రబాబుకు అని అన్నారు.

చిత్రం..అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన మహాధర్నాలో ప్రసంగిస్తున్న జగన్మోహన్‌రెడ్డి