రాష్ట్రీయం

జాబుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణలో మరో భారీ రిక్రూట్‌మెంట్‌కు పబ్లిక్ సర్వీసు కమిషన్ రంగం సిద్ధం చేసింది. తెలంగాణ పరిధిలోని వివిధ గురుకులాల్లో 9 క్యాటగిరీలకు సంబంధించి 7306 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసిన కమిషన్, ఈనెల 10నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. దరఖాస్తులకు మార్చి 4వరకూ గడువు విధించినట్టు కమిషన్ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2136 పోస్టులు, సాధారణ గురుకులాల్లో 307, బీసీ గురుకులాల్లో 1789, గిరిజన గురుకులాల్లో 994, మైనార్టీ గురుకులాల్లో 2080 కలిపి మొత్తం 7306 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందుకోసం కమిషన్ క్యాటగిరివారీ 9 నోటిఫికేషన్లు ఇవ్వనుంది. టిజిటి పోస్టులు 4362, పిజిటి 921, పిడి పోస్టులు 6, పిఇటి 616, ఆర్టు టీచర్ పోస్టులు 372, క్రాఫ్ట్ టీచర్లు 43, మ్యూజిక్ టీచర్లు 197, స్ట్ఫానర్సు 533, లైబ్రేరియన్ పోస్టులు 256 భర్తీ చేస్తారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో టిజిటి 1281, పిజిటి 257, పిఇటి 182, ఆర్టు టీచర్లు 63, క్రాఫ్ట్ టీచర్లు 3, మ్యూజిక్ టీచర్లు 92, స్ట్ఫా నర్సులు 121, లైబ్రేరియన్లు 137 కలిపి మొత్తం 2136 పోస్టులు భర్తీ చేస్తారు. టిఆర్‌ఇఐఎస్‌లో టిజిటి 74, పిజిటి 136, పిఇటి 22, ఆర్టు టీచర్లు 15, క్రాఫ్ట్ టీచర్లు 14, మ్యూజిక్ 14, స్ట్ఫా నర్సులు 32కలిపి మొత్తం 307 భర్తీ చేస్తారు. జ్యోతిరావు పూలే బిసి సంక్షేమ గురుకులాల్లో టిజిటి 1170, పిజిటి 83, పిఇటి 135, ఆర్టు టీచర్లు 69, క్రాఫ్ట్ 26, మ్యూజిక్ 52, స్ట్ఫా నర్సు 135, లైబ్రేరియన్‌లు 119 పోస్టులు కలిపి 1789 పోస్టులు భర్తీ చేస్తారు. గిరిజన గురుకులాలల్లో టిజిటి 621, పిజిటి 165, పిడి 6, పిఇటి 83, ఆర్టు టీచర్లు 30, మ్యూజిక్ 39, స్ట్ఫానర్సు 50 కలిపి 994 పోస్టులు భర్తీ చేస్తారు. మైనార్టీ గురుకులాల్లో టిజిటి 1216, పిజిటి 280, పిఇటి 194, ఆర్టు టీచర్లు 195, స్ట్ఫా నర్సులు 195 పోస్టులు కలిపి 2080 పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తంగా చూస్తే టిజిటి 4362, పిజిటి 921, పిడిలు 6, పిఇటిలు 616, ఆర్టు టీచర్లు 372, క్రాఫ్ట్ టీచర్లు 43, మ్యూజిక్ టీచర్లు 197, స్ట్ఫా నర్సులు 533, లైబ్రేరియన్ పోస్టుల 256 భర్తీ చేస్తారు.