రాష్ట్రీయం

ఎన్టీఆర్ జీవితచరిత్రను తెరకెక్కిస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 6: నందమూరి అభిమానులకు మరో శుభవార్త. నందమూరి అందగాడు బాలయ్య బాబు త్వరలో నిమ్మకూరు బుల్లోడు ఎన్టీఆర్ పాత్రలో అలరించనున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై త్వరలో సినిమా తీయనున్నట్లు, ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని స్వయంగా బాలయ్య చేసిన ప్రకటన నందమూరి అభిమానుల్లో ఆనందోత్సాహాలు నింపింది. తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయంతో మంచి జోష్ మీదున్న ప్రముఖ సినీహీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తన అల్లుడు, టిడిపి నేత నారా లోకేష్‌తో కలిసి సోమవారం తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరును సందర్శించారు. ఈసందర్భంగా 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో అభిమానులనుద్దేశించి బాలయ్య ప్రసంగిస్తూ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీయనున్నట్లు చెప్పారు.
ఎన్టీఆర్ పాత్రను స్వయంగా తానే పోషిస్తానని ఆయన ప్రకటించటం నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా చేసింది. సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ను బాలకృష్ణ యుగపురుషుడిగా అభివర్ణించారు. యుగపురుషుడి జీవితాన్ని తెరకెక్కించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరారు. తన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని గతంలోనే ఎన్టీఆర్ తెరకెక్కించాలని ప్రయత్నించారని, కానీ రాజకీయ రంగ ప్రవేశం వల్ల నాడు సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. ఆ అదృష్టం తనకు దక్కటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య ఘట్టాలైన సినీ, రాజకీయ ప్రస్థానాల్ని ఈ చిత్రంలో చూపిస్తామన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణంపై పరిశోధన జరుగుతోందన్నారు. త్వరలోనే దర్శకుడు ఎవరనేది ప్రకటిస్తానన్నారు. తన అల్లుడు నారా లోకేష్ విరామం లేకుండా పార్టీకి, ప్రజలకు సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. తాను కూడా ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, నటుడిగా చలనచిత్ర రంగానికి తనవంతు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు తమ రక్తం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని బాలకృష్ణ వివరించారు.