రాష్ట్రీయం

గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 6: మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్‌లో వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. జెండా పాట కంటే తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు మార్కెట్‌లో ఆందోళన జరిపారు. ఖమ్మం మార్కెట్‌లో సోమవారం జెండా పాట 9,100 రూపాయలు ఉండగా పంటలను కొనుగోలు చేసే వ్యాపారులు మాత్రం 7,800 నుండి 8వేల రూపాయలకు కొనుగోలు చేస్తుండటంతో రైతుల ఆగ్రహనికి గురయ్యారు. మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ అక్కడకు రావటంతో రైతులు ఆయనను అడ్డుకొని నిలదీశారు. జెండా పాట ప్రకారమే మార్కెట్‌లో రైతులకు ధరలను చెల్లిస్తామని, ఆందోళన విరమించాలని కృష్ణ కోరగా రైతులు ఆందోళనను విరమించారు. అనంతరం చైర్మన్ వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్‌లో రైతులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంటలకు మార్కెట్‌లో నిర్ణయించిన జెండా పాటపై వంద, రెండు వందలు మినహయించి వ్యాపారులు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో వారి లైసెన్సులు రద్దుచేసి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వ్యాపారులు గుంటూరు మార్కెట్‌లో మిర్చి పంటకు ధర తక్కువ ఉందని, అందుకే ఇక్కడ కూడా తగిన ధరలను చెల్లిస్తున్నామని వివరించారు.