ఆంధ్రప్రదేశ్‌

యూనియన్లకు రైల్వేబోర్డు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: రైల్వే కార్మిక సంఘాలకు రైల్వేబోర్డు గట్టి షాక్‌నిచ్చింది. ఇక నుంచి సేఫ్టీ విభాగాల్లో పనిచేసే సూపర్‌వైజర్లు కార్మిక సంఘాల్లో కొనసాగరాదంటూ బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల సక్రమంగా విధులు నిర్వహించేందుకు వీలు లేకుండా పోతోందని భావించిన రైల్వే సంఘం కార్యకలాపాల్లో చురుగ్గు పాల్గొనడం, దీనివల్ల రైల్వేలో విధులకు న్యాయం చేయలేని పరిస్థితులు, ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు సంబంధించిన సేవలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడటం, పూర్తిగా సంఘం కార్యకలాపాలకే పరిమితమయ్యే సేఫ్టీ సూపర్‌వైజర్లు తమ విధులపట్ల నిర్లక్ష్యం చూపే పరిస్థితులపై అధ్యయనం చేసిన రైల్వే ఈ మేరకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా దీనికి శ్రీకారం చుట్టిన రైల్వేబోర్డు ఈ ఏడాది మార్చి తరువాత సేఫ్టీ సూపర్‌వైజర్లు, సేఫ్టీ విభాగంలో పనిచేసే వారంతా రైల్వే కార్మిక సంఘాల నుంచి వైదొలగాల్సిందిగా ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాల్లో ఆఫీస్ బేరర్లుగా వివిధ పదవుల్లో కొనసాగరాదంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాల్సిందిగా కోరుతూ ఆయా రైల్వేజోన్ల జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా రైల్వేబోర్డు ఆదేశాలతో సేఫ్టీ క్యాటగిరీల్లో పనిచేసే సూపర్‌వైజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు ఎక్కువ శాతంలోనే కార్మిక సంఘాలకు, ఇవి నిర్వహించే కార్యకలాపాలకు దూరం కావాల్సి ఉంటుంది. మిగిలిన కేటగిరీల్లో ఉన్న ఉద్యోగులు మాత్రం సంఘాల్లో కొగసాగవచ్చనే ఆదేశాలతో సంఘాలకు కాస్తంత ఊరట లభిస్తున్నా, కీలకమైన సేఫ్టీ కేటగిరీ అధికారులకు మాత్రం ఈ ఆదేశాలు పెద్ద షాక్. ఈ నిర్ణయంతో సెలవు పెట్టేందుకు, కార్మిక సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేందనుకు ఏమాత్రం అవకాశం లేకుండా పోతుందని, అందువల్లే రైల్వే బోర్డు ఈ విధమైన మెలిక పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రైల్వే జారీ చేసిన ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆయా జోన్లు, డివిజన్ల పరిధిల్లో కార్మిక సంఘాలు ఆందోళకు దిగాయి. ఇక నుంచి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాజ్యంగం కల్పించిన హక్కు ప్రకారం కార్మిక సంఘాల్లో కొనసాగవచ్చని సంఘాల ప్రతినిధులు వాదిస్తున్నారు.