రాష్ట్రీయం

మార్చి నుంచి ఖాతాల్లోకే పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల కష్టాలు తీరనున్నాయి. తమకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం తపాలా కార్యాలయాలు, బ్యాంక్‌ల ఎదుట నిరీక్షించాల్సిన పని ఇక ఉండదు. వచ్చే మార్చి నుంచి లబ్ధిదారుల బ్యాంక్, తపాల ఖాతాల్లోనే వారి పెన్షన్లు జమ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు పెన్షన్లు బయోమెట్రిక్ విధానంలో అందుతుండగా, కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు వేలి ముద్రలతో చెల్లించడంతో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దుతో కోట్లాది రూపాయలు నగదు రూపంలో చెల్లించాల్సిన పెన్షన్లు నిలిచిపోయాయి. ఇదిలావుండగా ఇక నుంచి అక్రమాలకు, ఆలస్యాలకు తావులేకుండా లబ్ధిదారుల ఫోన్ నెంబర్లను కూడా సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్‌దార్లు 35,56,315మంది ఉన్నారు. అందులో వృద్ధులు 13,17,690, వికలాంగులు 4,50,682, వితంతువులు 13,19,922, చేనేత కార్మికులు 33,980, బీడి కార్మికులు 3,46,513, కళాకారులు 30,487, గీత కార్మికులు 57,041మంది ఉన్నారు. అత్యధికంగా 2,28,467మంది నిజామాబాద్ జిల్లాలో పెన్షన్లు పొందుతుండగా అత్యల్పంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 46,039మంది పెన్షన్లు అందుకుంటున్నారు. వీరి ఖాతాలన్ని ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంక్‌లు, తపాలా శాఖ కార్యాలయాల్లో ఉన్నాయి. కాగా వచ్చే మార్చి నెల నుంచి వారి వారి బ్యాంక్, తపాల ఖాతాలోనే పెన్షన్ సొమ్మును జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారి గుట్టును కూడా రట్టు చేయనున్నారు. అందుకోసం లబ్ధిదారుల బ్యాంక్, తపాల ఖాతాల నెంబర్లతో పాటు ఆధార్ నెంబర్, సెల్‌ఫోన్ నెంబర్ అందించాలని సూచిస్తున్నారు. ఖాతాలు లేని లబ్ధిదారులను గుర్తించి వారికి వెంటనే బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే అదేశాలు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 63శాతం మంది మాత్రమే తమ ఆధారాలను సమర్పించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన వారి ఆధారాలను సేకరిస్తున్నామని, వారు ఇవ్వకపోతే మార్చి నెల పెన్షన్లు నిలిపివేస్తామని, వారి నుంచి వివరాలు సేకరించి అప్‌లోడ్ చేసిన తర్వాతే పెన్షన్లు మంజూరు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.