రాష్ట్రీయం

‘స్వచ్ఛ’లో వెనుకబడిన తెలుగు రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: మరుగుదొడ్ల నిర్మాణంలో రాజస్థాన్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. ఈ చేదు నిజం బుధవారం హైదరాబాద్‌లో యునిసెఫ్, ‘వాష్’ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో వెల్లడైంది. యునిసెఫ్, హెచ్‌ఎఫ్‌ఓ వాటర్, శానిటేషన్, హైజనీస్ (వాష్) స్పెషలిస్టు ఎస్.ఆర్. నల్లి ప్రసంగిస్తూ బహిరంగ మల, మూత్ర విసర్జన లేని రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్ర ఏర్పడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయల బాలల సంస్ధ, ప్రభుత్వ సహకారంతో, సామాజిక సంస్ధలు కలిసి 2019 నాటికి మల, మూత్ర విసర్జన రహిత దేశంగా చేయాలని అన్నారు. మలం వల్ల డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళడం ద్వారా అంటు వ్యాధులు ప్రబలుతాయని గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే సగటు కంటే తక్కువగా ఉన్నాయని అన్నారు. పారిశుధ్యం గురించి విద్యార్థులకు పాఠశాల దశ నుంచే నేర్పించాలని ఆయన సూచించారు. మరుగు దొడ్లు నిర్మించడమే కాదు వాటిని సక్రమంగా నిర్వహించడమూ ముఖ్యమని అన్నారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
పాఠశాలలను సందర్శించి నిర్వహణను పరిశీలించేందుకు జిల్లాకు 40 మందిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో విద్యార్థులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఆర్ నల్లి తెలిపారు.
గ్రామీణ సంస్ధల జాతీయ మండలి (ఎన్‌సిఆర్‌ఐ) చైర్మన్ డాక్టర్ డబ్ల్యుజి ప్రసన్న కుమార్ ప్రసంగిస్తూ బహిరంగ మల విసర్జన రహిత భారత్‌గా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యునిసెఫ్, ఇంకా వివిధ సంస్ధల సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్, గ్రామ స్థాయిలో అమలు చేయాలంటే స్వచ్ఛంద సంస్ధల సహకారం అవసరమని అన్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన ద్వారా అంటు వ్యాధులు ప్రబలుతాయని, ఫలితంగా శరీరంలో ఎదుగుదల లేకపోవడం, బుద్ది మానసిక వికాసం పెరగకపోవడం జరుగుతాయని ఆయన తెలిపారు. మల, మూత్ర శాలను నిర్మించడంతో సరిపోదని, దానిని పరిశుభ్రంగా ఉంచుకోవడమూ ముఖ్యమని అన్నారు. మల, మూత్ర విసర్జన కాల్వలుగా పారి, చెరువుల్లోకి వెళితే ఆ నీరు కాలుష్యమై ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆయన చెప్పారు. గాంధీజీ పారిశుధ్యం కోసం కృషి చేశారని, కేంద్రం కూడా స్వచ్ఛ భారత్ చేపట్టిందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలూ పారిశుధ్యం కోసం కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.
ఎపిహెచ్‌ఆర్‌డిఐ డైరెక్టర్ జనరల్ డి. చక్రపాణి ప్రసంగిస్తూ పరిశుభ్రత విషయంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఇంటికీ టాయ్‌లెట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ఇది మూడు, నాలుగేళ్ళలో పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. మల, మూత్ర విసర్జనను ఫర్టిలైజర్స్‌గా మార్చేందుకు ప్రయత్నం జరుగుతున్నదని, చైనాలో కోటి ఎకో టాయ్‌లెట్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా రేగుల లంకలో, నల్లగొండ జిల్లా చిట్యాలలో అటువంటి ప్రయత్నం జరుగుతున్నదని ఆయన చెప్పారు. యునిసెఫ్ హైదరాబాద్ ఫీల్డ్ ఆఫీసర్ జిరూమాస్టర్ ప్రసంగిస్తూ కర్నాటక, తెలుగు రాష్ట్రాలు బహిరంగ మల, మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యునిసెఫ్ (్ఢల్లీ) ‘వాష్’ చీఫ్ నికోలస్ ఆస్‌బర్ట్ మాట్లాడుతూ బహిరంగ మల, మూత్ర విసర్జన లేకుండా యునిసెఫ్ చేస్తున్న కృషిని వివరించారు. ఇంకా ఈ సమావేశంలో స్వచ్చ తెలంగాణ రాంమోహన్, డాక్టర్ మురళీ, అజేయ్, శ్రీహరి, వెంకటేశ్ తదితరులు ప్రసంగించారు. ఈ నెల 10 వరకు సదస్సు జరుగుతుంది.