ఆంధ్రప్రదేశ్‌

రెండ్రోజుల్లో నారీ భేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 8: ప్రతిష్టాత్మక జాతీయ మహిళా పార్లమెంటేరియన్‌ల సదస్సుకు విజయవాడ సమీపాన పవిత్ర సంగమం వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్రలో నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖ మహిళా పార్లమెంటేరియన్‌లు, వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన నారీమణులు, కళాశాల విద్యార్థినులు హాజరవుతున్నారు. విజయవాడ కృష్ణా నదీ తీరాన పవిత్ర సంగమం దగ్గర మహిళా సాధికారత లక్ష్యంగా ఈ నెల 10,11,12 తేదీల్లో మూడు రోజులపాటు సదస్సు జరగనుంది. సమాజంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉన్నత లక్ష్యంతో, వారిలో స్ఫూర్తి కలిగించి, చైతన్యం తీసుకువచ్చేందుకు సదస్సు నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే దేశవిదేశాల నుండి దాదాపు 9 వేల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఈ సంఖ్య 14వేలకు చేరే అవకాశం ఉంది. వీరిలో అత్యధిక మంది విద్యార్థినులు ఉంటారు. కొత్త రాష్ట్రంలో శాసనసభ నూతన భవనాలను నిర్మించుకుని ప్రారంభించుకోబోతున్న వేళ రాజధానిలో ఇటువంటి అద్వితీయమైన సదస్సు నిర్వహించడం అరుదైన సందర్భంగా భావించవచ్చు. సామాజికంగా, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలు ఎదుగుతున్నారు. పలు రంగాలలో దూసుకుపోతున్నారు. మనదేశంలో వివిధ రంగాల్లో మాజీ రాష్టప్రతి ప్రతిభాపాటిల్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, మేనకాగాంధీ, స్మృతి ఇరాని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, పెప్సికో సిఈఓ ఇంద్రనూరుూ, ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసిఐసిఐ సిఈఓ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సిఈఓ, ఎండి శిఖాశర్మ, శ్రీరాం లైఫ్ ఇన్సురెన్స్ ఎండి అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండి కిరణ్ మజుందార్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండి ఉషా సంగ్వాన్, వీరే కాకుండా కార్పొరేట్ రంగంలో విజయలక్ష్మీ అయ్యర్, నైనాలాల్ కిద్వాయ్, అర్చనా భార్గవ, శుభలక్ష్మీ పనే్స, కకు నకటే, రేణు చల్లూ, రోషిణి నాడార్, కీర్తిగా రెడ్డి, నీలం ధావన్, అరుణా జయంతి, దిబ్జానీ ఘోష్, రేఖా ఎం.మీనన్, రూపా కుడ్వా, వనితా నారాయణన్ వంటి వారు బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మహిళలు బలమైన శక్తిగా ఉన్నారు. అంగ్ సాన్ సూకీ, కిరణ్ బేడీ, తస్లిమా సస్రీన్ వంటి వారితోపాటు సాహిత్యం, సినిమా, క్రీడలు వంటి రంగాల్లో కూడా మహిళలు తమశక్తి సామర్ధ్యాలను చాటుతున్నారు. ఈ సదస్సుకు హాజరైన మహిళలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఆకాశంలో సగమైన మహిళల బాధ్యతలు, బాధలు, కోరికలు, ఆలోచనలు, అభిప్రాయాలు, వారెదుర్కునే సమస్యలపై సమావేశంలో చర్చిస్తారు. అన్ని మతాలు, ప్రాంతాలు, కులాలు, సంస్కృతులు, వివిధ సామాజిక వర్గాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలందరూ ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే రాజకీయ, విద్య, క్రీడలు, పరిశ్రమలు, మీడియా, సినిమా, కళలు, న్యాయ వ్యవస్థల నుంచి మహిళలతో పాటు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొని వారి అనుభవాలను తెలియజేస్తారు. రాజకీయ, పారిశ్రామిక, విద్యా, పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల ఎదుగుదలకు గల అవకాశాలను చర్చిస్తారు. అంతేకాక భారతదేశం సుసంపన్నం కావడానికి మహిళా శక్తిని ఏవిధంగా వినియోగించాలి వంటి అంశాలపై కూడా ప్రసంగిస్తారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు ఎదుర్కొనే రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు చర్చించి, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, విధి విధానాలు ఈ సమావేశంలో రూపొందిస్తారు. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ ప్రతినిధులతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన మహిళలు కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. దేశం నలుమూలల నుంచి 405 మంది మహిళా శాసనసభ్యులు, 92 మంది మహిళా పార్లమెంట్ సభ్యులు, కార్పొరేట్ సంస్థల నుంచి మూడు వందల మందికిపైగా మహిళా ప్రతినిధులు, 8వేల నుంచి 10వేల వరకు విద్యార్థినులు హాజరవుతారు. ఈ సదస్సులో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసన సభాపతి కోడెల శివప్రసాద్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, రవి శంకర్, కేంద్ర మంత్రులు, ఇంకా దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.

పవిత్ర సంగమం వద్ద సిద్ధమవుతున్న సాంస్కృతిక కార్యక్రమాల వేదిక