జాతీయ వార్తలు

ఏపీకి 433 కోట్లు కరువు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఆంధ్రప్రదేశ్‌లోని కరువు నెలకొన్న ప్రాంతాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాలుకు కేంద్ర ప్రభుత్వం రూ.433.77 కోట్లు కేటాయించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణకు అందజేయవలసిన కరువు సహాయంపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పాణిగరియ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి, హోం, ఆర్థిక, వ్యవసాయ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు 6433.77 కోట్లు, ఒడిస్సాకు 815 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌కు 1304.52 కోట్ల ఆర్థిక సహాయం అందజేయాలని కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని కరువు నెలకొన్న ప్రాంతాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసిన సహాయంతో పోలిస్తే ఎన్.డి.ఏ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన ఆర్థిక సహాయం చాలా తక్కువ.