రాష్ట్రీయం

రైల్వే స్టేషన్లకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రైల్వే స్టేషన్ల ఆధునీకరణ మెగా ప్రాజెక్టులో భాగంగా సికిందరాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. రూ.282 కోట్లతో సికిందరాబాద్, రూ.190కోట్లతో విజయవాడ రైల్వేస్టేషన్‌ల ఆధునీకరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ గురువారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 36 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు నోచుకోనున్నాయి. వీటిలో తెలంగాణలోని సికిందరాబాద్, హైదరాబాద్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్, కాచిగూడ, నిజామాబాద్ స్టేషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఏపిలో విజయవాడ, గుంతకల్ జంక్షన్‌ల పరిధిలోని అనకాపల్లి, భీమవరంటౌన్, చీరాల, ఏలూరు, గూడూరు, కాకినాడటౌన్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తెనాలి, సామల్‌కోట్, తుని, తాడేపల్లిగూడెం, తిరుపతి, అనంతపూర్, కడప, రేణిగుంట స్టేషన్ల ఆధునీకరణ జరుగుతుందని ఆయన వివరించారు. వీటితో పాటు మహరాష్టల్రో 5, కర్నాటకలో రెండింటిని ఆధునీకరించనున్నారు. విశాలమైన ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపడతామని, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్స్, మల్టీలెవెల్ పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణాలు జరుగుతాయని వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. స్టేషన్లలో మాల్స్, మల్టిప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, షాపుల నిర్మాణం చేపడతామన్నారు. రైల్వే స్థలాలను ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తామన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్