రాష్ట్రీయం

పట్టు వదలని వేములఘాట్ వాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 9: పోలీసులతో బెదిరింపులు, కేసులు బనాయింపులు, రాజీమార్గాలు రకరకాల ప్రయత్నాలు చేసినా ప్రభుత్వానికి ఏ మాత్రం లొంగిపోకుండా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం అసలే వద్దంటూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామ ప్రజలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 250 రోజులు పూర్తి చేసుకున్నారు. 250 రోజుల దీక్షలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు వచ్చి గ్రామస్తులకు సంఘీభావం తెలుపుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అభినందనలు తెలిపారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించగా తీవ్రంగా ప్రతిఘటించిన ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్థులు సైతం చల్లబడినా వేములఘాట్ ప్రజలు మాత్రం ఎంత మాత్రం వెనకడుగు వేయడం లేదు. రోజు వారిగా గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దీక్షల శిబిరానికి స్వచ్ఛందంగా తరలివచ్చి సాయంత్రం వరకు శిబిరంలో కూర్చుంటున్నారు. రాజీవ్ రహదారిని దిగ్భంధం చేయడానికి బయలుదేరిన ఆయా గ్రామాలకు చెందిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడమే కాకుండా గాల్లోకి సైతం కాల్పులు జరిపి అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసిన విషయం తెలిసిందే.
పొలాలకు వెళ్లే రైతులను సైతం నిశితంగా పరిశీలించడమే కాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గ్రామాలను పోలీసులు నిర్భందంలోకి తీసుకున్నారు. 123 జివోతో పాటు 2013 చట్టం, 2016 చట్టం ప్రకారంగా భూ సేకరణ చేస్తామన్నా తాము ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని ఖరాకండీగా తేల్చిచెబుతున్నారు.