రాష్ట్రీయం

విశ్వజనీనం హైందవ ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 9: పరమాత్ముడైన శ్రీహరి సృష్టిలో ప్రతి ఒక్కరూ సమానులేనన్న సత్యాన్ని గుర్తించి, సంఘంలోని ప్రతివారూ తోటిమానవుడిని ప్రేమించి, అన్నివేళలా ఆదరించి, సమాదరించి, మానవత్వ సమానత్వానికి పెద్దపీట వేయాలని విశ్వగురు పీఠాధిపతి శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పిలుపునిచ్చారు. గుంటూరు సమీపంలోని గోరంట్ల అన్నపూర్ణనగర్‌లోని శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యజ్ఞస్థలిలో తిరుపతి నుంచి విచ్చేసిన అర్చకస్వాముల స్వీయ పర్యవేక్షణలో నాలుగు రోజులుగా జరుగుతున్న నవగ్రహముఖ సుదర్శన మహాశాంతి హోమాలకు విశ్వంజీ వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి గావించారు. అనంతరం భక్తులనుద్దేశించి సందేశమిస్తూ వేదభూమి, తపోజ్ఞానభూమి అయిన మన భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులేనని, ప్రపంచానికి జ్ఞానమార్గాన్ని, వెలుగును చూపించిన మన హైందవ ధర్మం విశ్వజనీనమైందని స్వామీజీ పేర్కొన్నారు. అయితే ప్రతివారూ తెల్లవారుజాము నుండి రాత్రి విశ్రమించే వరకు స్వీయ స్వధర్మాలను పాటించాలని ఆయన హితబోధ చేశారు. రానున్న కాలంలో గోరంట్ల వెంకన్న దేవస్థానం అమరావతి ప్రాంతానికి ముఖద్వారమై దివ్యసన్నిధానమై వర్ధిల్లుతుందని విశ్వంజీ విశ్వాసం వ్యక్తంచేశారు. ఉభయ రాష్ట్రాలతో పాటు మన దేశం అన్ని రంగాల్లో సముజ్వల ప్రగతిని సాధించడంలో దేశ పౌరులంతా శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు. అంతకుముందు విశ్వయోగి విశ్వంజీ మహరాజ్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, డిటిసి రాజ్‌కుమార్ తదితర ప్రముఖులు స్వర్ణ్భారణాలతో అలంకృతులైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మహాశాంతిహోమ పూర్ణాహుతి ప్రసాదాన్ని భారీగా వితరణ చేశారు.