రాష్ట్రీయం

నేటి నుంచి మహిళా పార్లమెంటేరియన్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 9: కృష్ణానదీ తీరాన ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద శుక్రవారం నుంచి మూడురోజులపాటు నిర్వహించనున్న సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 12వేల మంది హాజరయ్యే ఈ సదస్సుకు అదే స్థాయిలో సౌకర్యాలు సమకూర్చారు. దాదాపు పదివేల మంది ఒకేచోట కూర్చోవడానికి అనువుగా అత్యంత ఆధునికంగా అతి పెద్ద సమావేశ హాలు నిర్మించారు. సదస్సు ప్రదేశానికి ఎదురుగానే అతి పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. విఐపిల కోసం సదస్సు హాలు పక్కనే మరో డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ముఖ్యమంత్రి సమావేశ హాలు, డైనింగ్ హాలు నిర్మించారు. వాటన్నిటి లోపల ఏసిలు అమర్చారు. మూడురోజులపాటు సాయంత్రాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం నదికి ఆనుకొని, బహిరంగ ప్రదేశంలో అత్యంత ఆధునికంగా మరో పెద్ద స్టేజీ నిర్మించారు. అక్కడ కృష్ణా పుష్కరాల సందర్భంగా నాటిన పూల మొక్కలు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సమీపంలోనే మీడియా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి సదస్సు దేశంలో జరగడం ఇదే మొదటిసారి. ఇంతటి సదస్సుకు వచ్చే వారందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖలకు చెందిన వేల మంది సిబ్బంది పనులు చేశారు. అందరికీ ఉపయోగపడే విధంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. శాశ్వత ప్రాతిపదికన అత్యంత ఆధునికమైన 30 మరుగుదొడ్లు నిర్మించారు. వాటిలో పురుషులు, మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా ప్రత్యేక మరుగుదొడ్లు వున్నాయి. వాటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. విఐపిల కోసం ప్రత్యేకంగా 90 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. సదస్సు జరిగే సమయంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏడు ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు. నిర్వహణ ఏర్పాట్లు చూసే బాధ్యులు ముందు జాగ్రత్తగా దాదాపు 20 జనరేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌శాఖ అధికారులు కూడా మరో నాలుగు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాలకు 26 స్టాల్స్‌ని ఏర్పాటుచేశారు. డ్వాక్రా మహిళలు వీటిని నిర్వహిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సదస్సు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. పవిత్ర సంగమ ప్రాంతాన్ని అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు. కాగా సదస్సుకు హాజరయ్యే వారికి అత్యవసరంగా వైద్యం అందించడం కోసం వైద్య ఆరోగ్యశాఖవారు రెండు మెడికల్ క్యాంప్‌లు, ఆరు నుంచి పది బెడ్‌లతో ఓ తాత్కాలిక మినీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు. మూడురోజులు ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తం పదిమంది డాక్టర్లు విధులు నిర్వహిస్తారు. ఎవరికైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడితే సమీపంలోని కార్పోరేట్ ఆస్పత్రులకు తరలిస్తారు. అందుకోసం మూడు కార్పోరేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో పదేసి బెడ్ల చొప్పున అందుబాటులో వుండే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే వివిధ విభాగాల్లో డాక్టర్లు అందుబాటులో వుండే విధంగా కూడా ఆయా ఆస్పత్రుల్లోని డాక్టర్లకు విధులు నిర్ణయించారు.
అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచారు. మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ శామ్యూల్ ఆనందకుమార్ గురువారం సాయంత్రం వైద్య శిబిరాలు ఏర్పాటుచేసే ప్రదేశాన్ని సందర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చే విఐపిలకు ప్రముఖ హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. కొందరు అధికారులకు ప్రభుత్వ అతిధి గృహాలు కేటాయించారు. విద్యార్థులు, అధ్యాపకుల కోసం విజయవాడ నగరంలోని 46 ప్రాంతాల్లో కాలేజీలు, పాఠశాలలను కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో వారికి సరిపోయే విధంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులు అనేక మంది వస్తున్నందున పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ అధికారులు దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు గురువారం సా యంత్రం సంగమ ప్రదేశాన్ని సందర్శించి, ఏర్పాట్లన్నింటినీ పరిశీలించారు. ముందు జాగ్రత్తగా పవిత్ర సంగమ ప్రాంతంలో సదస్సు ప్రదేశం లోపల, బయట మొత్తం 170 సిసి కెమెరాలు అమర్చారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్రం..మోదీ, చంద్రబాబు, తదితరుల సైకత శిల్పాలు రూపొందిస్తున్న విద్యార్థినులు