రాష్ట్రీయం

అవకాశాల్లో సగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
పేరుకే ఆకాశంలో సగం.. కానీ అవకాశాలు శూన్యం! మాకు రావలసిన హక్కులేవీ? మాపై శరపరంపరగా జరుగుతున్న దాడులను అరికట్టరేం? సిగ్గుమాలిన బాల్యవివాహాలపై కొరడా ఝళిపించరేం? మా చదువులపై తలిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చేదెవరు? అవకాశాలిస్తే మేమూ పురుషులతోపాటు రాణించమా? మాపై ఎందుకీ దాడులు? ఇంకా ప్రపంచానికి, పురుష సమాజానికి మాపట్ల ఎందుకీ పక్షపాతం? ప్రభుత్వం మాకిచ్చే రక్షణ ఇదేనా? ... ఇదీ దేశ విదేశాలకు చెందిన మహిళా ప్రముఖులు ప్రపంచం ఎదుట ఆవిష్కరించిన ఆవేదన. పాలకులకు సంధించిన ప్రశ్నాస్త్రాలు.
పనె్నండువేలమంది సాక్షిగా మూడురోజుల జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వేదిక అయిన, ఇబ్రహీంపట్నం పవిత్రసంగమ తీరం మహిళా సమస్యల గర్జనతో ప్రతిధ్వనించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లబ్ధప్రతిష్ఠులయిన మహిళా ప్రముఖులు తమ ఎదుగుదలకు ముందు.. పురుషాధిక్య సమాజంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించిన వైనాన్ని సాటి మహిళలతో కలబోసుకున్నారు.
యాసిడ్‌దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ అలనాటి తన అనుభవాలు, ఆ సమయంలో తాను అనుభవించిన నరకయాతనను మహిళలకు వివరించారు. సినీ నటి మనీషా కొయిరాలా సైతం సినీ జీవితంతో తాను హీరోల నుంచి ఎదుర్కొన్న వివక్ష, అవమానాలను పంచుకున్నారు. సినిమా రంగంలో మహిళల పట్ల ఏ స్థాయిలో వివక్ష ఉంటుందన్నది ఆమె ఆవేదన వెల్లడించింది. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ బుట్టా రేణుక సైతం, సమాజంలో సగం శాతం ఉన్న మహిళకు, అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పదిశాతమే అవకాశాలు దక్కడాన్ని ఆమె ప్రశ్నించారు.
ప్రధానంగా ఇనే్నళ్లయినా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించకపోవడంపై మహిళా ప్రముఖులు తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ సదస్సు స్ఫూర్తితోనయినా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ఆమోదించి, మహిళల పట్ల పార్టీలు తమ చిత్తశుద్ధి, నిజాయితీ నిరూపించుకోవాలని నినదించారు. కల్వకుంట్ల కవిత, బుట్టారేణుక తదితరులు ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించాలన్నారు.
కాగా, ఈ ఆధునిక యుగంలోనూ మహిళలపై దాడులు, లింగవివక్ష కొనసాగడాన్ని మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. వీటిపై ప్రభుత్వం కొరడా ఝళిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సదస్సు తొలిరోజు టీఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత చేసిన ప్రసంగం మహిళల్లో స్ఫూర్తినింపింది. గురజాడను గుర్తు చేస్తూ ఆమె చేసిన ప్రసంగంలో కుటుంబ సామాజిక పరిస్థితులు స్పృశించారు. సాంఘిక దురాచారాలు, కుటుంబ వ్యవస్థనుంచే మహిళలపై కొనసాగుతున్న వివక్ష, అణచివేతను ప్రస్తావించారు. స్వశక్తితో మహిళలు ఎదగాలని, మద్యనిషేధంపై దూబగుంట రోశమ్మ చేసిన ఒంటరిపోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కవిత ప్రసంగం పరిశీలిస్తే ఉమ్మడి కుటుంబాల నుంచి ఇప్పటి కుటుంబ విధానం వరకూ ఆమె సునిశిత పరశీలనాశక్తి ఏమిటన్నది స్పష్టమయింది. సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాలేజీ విద్యార్ధినులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పిచ్చాపాటీ మాట్లాడుతూ చేసిన ఆవేదన, అభిప్రాయాలు, సలహా సూచనలు ఈ తరం విద్యార్ధినులు.. సమాజంపై ఏ స్థాయిలో అవగాహన, చైతన్యవంతంగా ఉన్నారన్నది అర్ధమవుతుంది. ముఖ్యంగా తమ చదువుల విషయంలో తలిదండ్రులు అనుసరిస్తోన్న నిర్లక్ష్య, అన్యాయ ధోరణిని ప్రశ్నించిన వైనం మహిళల్లో విద్యపై ఉన్న ఆసక్తిని చాటింది. ఇంకా బాల్యవివాహాలు కొనసాగుతున్న తీరు ఆ వ్యవస్థపై వారి వ్యతిరేకత, తాము కూడా పై చదువులు చదవాలన్న కాంక్ష బలంగా కనిపించింది. పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ ప్రసంగానికి స్పందన లభించింది. రాజకీయ నేతల ప్రసంగాలు పక్కకుపెడితే, మొత్తంగా తొలిరోజు సదస్సులో వక్తల ప్రసంగాలు మహిళలకు స్ఫూర్తిదాయకంగానే నిలిచాయి.