రాష్ట్రీయం

అక్షరాస్యతతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: మహిళలు విద్యావంతులైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రముఖ సినీతార మనీషా కోయిరాలా అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలతోపాటు సినీ రంగంలోనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, తానే స్వయంగా ఈ వివక్షను ఎదుర్కొని కొంతమేరకు నష్టపోయానని, తన స్వానుభవాన్ని వివరించారు. పవిత్ర సంగమం వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. రెన్యూమరేషన్ పట్ల సినీ రంగంలో మహిళల పట్ల వివక్ష తీవ్రంగానే ఉందని దీన్ని తాను అనుభవించానని అన్నారు. తొలి రోజుల్లో అనేక ఇబ్బందులకు కూడా గురయ్యానంటూ వివక్ష వల్లనే సినిమాల్లో ఆశించిన ఆఫర్లు రాలేదన్నారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 48 శాతంగా ఉంటే పార్లమెంటులో మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య 11 శాతం మాత్రమే ఉండటం సబబుగా లేదన్నారు. మహిళలు ఏ అంశంలోనూ తక్కువ కాదనే వాస్తవాన్ని పురుష సమాజం గుర్తించాల్సి ఉందని అవసరమైతే మహిళలు ఆదిశక్తిగా, పరాశక్తిగా మారగలరంటూ సున్నితంగా హెచ్చరించారు. మగబిడ్డ పుడితే ఒకలా, ఆడబిడ్డ పుడితే మరోలా ఆలోచించే రోజులు పోయాయన్నారు. వినూత్నంగా ఆలోచిస్తే మంచి ఫలితాలొస్తాయని, మహిళల్లో సహజసిద్ధంగా ఉండే సృజనాత్మకత వారికి ఎన్నో అవకాశాలను కల్పిస్తుందంటూ ఈ అవకాశాలను నవీన మహిళలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఇలాంటి సదస్సులు నిర్వహించడం హర్షణీయమన్నారు. సామాజిక సమస్యల పట్ల మహిళలు ధైర్యంగా నిలబడి ఎదురు నిలువాల్సిన అవసరం ఉందన్నారు. నేటి సమాజంలో మహిళలకు వివక్షత ఉందని, మగబిడ్డ పుడితే సంతోషించే తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే భారమంటూ జరుగుతున్న సంఘటన తనకే ఎదురైందన్నారు. తాను పుట్టగానే మా తాతగారు ఆడపిల్ల పుట్టిందా అంటూ బాధపడిన సంగతి అమ్మమ్మ ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయన్నారు.

చిత్రం..సభలో ప్రసంగిస్తున్న నటి మనీషా కొయరాలా