రాష్ట్రీయం

మూడు ‘సున్నా’లతో మార్పు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10:ప్రపంచంలో మూడు సున్నాలతో మార్పు సాధ్యమని నోబెల్ బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్ సామాజిక ఉద్యమకారుడు మహమ్మద్ యూనస్ తెలిపారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ పేదరికం, నిరుద్యోగం, కాలుష్యాలను సున్నా స్థాయికి తీసుకురావడంతో ప్రపంచంలో మార్పు సాధ్యమన్నారు. ఈ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ఆలోచించే విధానాన్ని భిన్నంగా ఆలోచించడం తన అలవాటన్నారు. ఇందులో భాగంగానే ధనికులకు, కొన్ని వర్గాల వారికే అందుబాటులో ఉన్న బ్యాంక్ సేవల గురించి భిన్నంగా ఆలోచించి గ్రామీణ బ్యాంక్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బ్యాంక్‌ను పేద మహిళలే తమ కోసం నిర్వహించుకుంటున్నారన్నారు. ఈ బ్యాంక్ అనేక మార్పులను తీసుకువచ్చిందన్నారు. నలుగురు మహిళలు యాజమాన్యం బాధ్యతలు నిర్వహిస్తున్నారని, 9 మిలియన్ కోట్ల టర్నోవర్‌తో జాతీయ బ్యాంక్‌ల నిబంధనలకు భిన్నంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. తల్లితండ్రుల్లో నిరక్ష్యరాస్యత వల్లే అసమానతలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పిల్లల వరకూ నిరక్ష్యరాస్యత కొనసాగించకూడదని, తల్లితండ్రుల తరమే నిరక్ష్యరాస్యతలో చివరి తరం కావాలన్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు బాసటగా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమస్యల పరిష్కారానికి భిన్నంగా ఆలోచించడం అవసరమని తెలిపారు. డబ్బు కోసం వ్యాపారం చేయడం సాధారణమని, కానీ సమస్యల నుంచి వ్యాపారం చేసే ప్రయత్నం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ప్రయత్నించడం పాత ఫ్యాషన్ అని, పలువురికి ఉపాధి కల్పించే వారిగా మారాల్సి ఉందన్నారు. నిరుద్యోగం అన్నది కృత్రిమ సృష్టిగా అభివర్ణించారు. మహిళలు అందరూ మంచి ఎంటర్‌ప్రెన్యూర్లేనన్నారు. జాబ్‌లో చేరడం వల్ల సృజనాత్మకత పోతుందని, తమపై నమ్మకాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పెద్దగా ఆలోచించి, చిన్నగా ప్రారంభించాలంటూ మహిళలకు దిశానిర్దేశం చేశారు.

చిత్రం..సదస్సులో ప్రసంగిస్తున్న నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్