రాష్ట్రీయం

కార్పొరేట్ వైద్యమూ ఫ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 6 ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవా పథకం కింద ఫిబ్రవరి 1 నుంచి నుంచి రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం కర్నూలు జిల్లా దీబగుంట్లలో జన్మభూమి- మావూరు కార్యక్రమం, తుగ్గలి మండలం రాతన గ్రామంలో పంట సంజీవని కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవా పథకం కింద ప్రస్తుతం కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే చికిత్స జరుగుతోందని, ముందుముందు అన్ని రకాల వ్యాధులకు పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జలసిరి పథకాన్ని ప్రారంభిస్తున్నామని, దీని కింద భూగర్భజలాలను విస్తృతస్థాయిలో పెంచి కరువు సైతం భయపడేలా దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పది లక్షల ఫారంపాండ్స్ (పంటకుంటలు) తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వివిధ కొలతల్లో పంటకుంటలను తవ్వడం ద్వారా భూమిపై పడిన ప్రతి వర్షపు చినుకు ఇంకిపోయి భూగర్భ నీటిమట్టం గణనీయంగా పెరుగుతుందన్నారు. ప్రతి మూడు ఎకరాలకు, ప్రతి బోరుకు సమీపంలో ఒక పంటకుంట ఉండేలా చూస్తామని తెలిపారు. మూడునెలల్లో పది లక్షల ఫారంపాండ్స్ తవ్వి జలసిరిని కాపాడుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు కొంతమంది ఉద్యోగులు, గత ప్రభుత్వ పాలకులే కారణమన్నారు. ఉద్యోగుల పనివిధానంలో మార్పులు తీసుకువచ్చి జవాబుదారీతనాన్ని పెంచుతున్నామన్నారు. రైతుల భూ సమస్యలను ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో జిపిఎస్ విధానం ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలిపే అవకాశం కల్పిస్తామన్నారు. రహదారులు, శిథిల భవనాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని విషయాన్ని తమ దృష్టికి తీసుకుని వస్తే జిపిఎస్ విధానంలో ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపారు తెలుసుకుని అధికారులు నేరుగా ఆ గ్రామానికి వెళ్లి ఫిర్యాదుదారుడిని కలిసి సమస్యను పరిష్కరిస్తారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్ ఖాతాలో పొందుపరిచామని, వీటి ద్వారా సమస్త వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వచ్చే ఒకటి, రెండేళ్లలో విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజికి వంద టిఎంసిల గోదావరి జలాలను తీసుకువస్తామని, తద్వారా మిగిలిన కృష్ణా జలాలను రాయలసీమ రైతాంగానికి అందజేస్తామని హామీనిచ్చారు. ఈ నీటిని సద్వినియోగం చేసుకొనేందుకు రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టి శరవేగంగా పూర్తి చేస్తామన్నారు.

చిత్రం.. కర్నూలు జిల్లా దీబగుంటలో జరిగిన గర్భిణుల సీమంతం కార్యక్రమంలో పాల్గొని మహిళను ఆశీర్వదిస్తున్న చంద్రబాబు