రాష్ట్రీయం

గళమెత్తుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: మహిళలు తమ హక్కుల కోసం గళాన్ని వినిపించాలని అమెరికాలోని మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్ అరుణా మిల్లర్ పిలుపునిచ్చారు. మహిళల పట్ల సమాజంలో ఆర్థిక, సామాజిక మార్పులు రావాలన్నారు. హక్కులు సాధించుకున్న మహిళలదే భవిత అన్నారు. రాజకీయాలే తన వ్యాపారమని, మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్‌గా ఎన్నికైన తొలి తెలుగు మహిళను తానేనని గుర్తు చేశారు. ప్రపంచంలో 180 దేశాలతో పోలిస్తే చట్టసభలకు మహిళలు ఎంపికవుతున్న దేశాల్లో భారత్ 145వ స్థానంలో ఉండగా అమెరికా 100వ స్థానంలోఉందన్నారు. తెలుగు ప్రజలకు ఘనమైన చరిత్ర ఉందని, అవకాశాలను అందిపుచ్చుకోవడం వలన మహిళల పరిస్థితి మెరుగవుతోందని చెప్పారు. హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికవకపోవడంతో ఇప్పటికీ చాలా మంది బాధపడుతున్నారని గుర్తు చేశారు.

చిత్రం..మహిళా పార్లమెంట్ సదస్సులో ప్రసంగిస్తున్న అరుణా మిల్లర్