రాష్ట్రీయం

రోజాపై ఓవరాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 11: అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తూ అట్టహాసంగా సాగుతోన్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు సందడి ఒకవైపు.. సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అరెస్టుతో చెలరేగిన రాజకీయ రగడ మరోవైపు. విజయవాడ వేదికగా నడిచిన హైడ్రామా ఏపీలో మొదలై తెలంగాణలో ముగిసింది. మహిళా సాధికారత కోసం నిర్వహిస్తున్న సదస్సుకు హాజరుకానివ్వకుండా మహిళా ప్రజాప్రతినిధి పట్ల పోలీసులు చూపించిన ఓవరాక్షన్ సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. సదస్సుకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టీ పెట్టగానే రోజాను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు, నాటకీయ ఫక్కీలో ఆమెను విజయవాడ, గుంటూరు జిల్లాల మీదుగా బలవంతంగా హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న అనుమానంతోనే నిర్బంధంలోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించటం వివాదానికి తావిస్తోంది. ఇదిలావుంటే, రోజాను పోలీస్ వాహనంలో తరలిస్తుండగా దారిపొడవునా హైడ్రామా నడిచింది.
తనపై పోలీస్ చర్యకు ఉపక్రమించడాన్ని ఎమ్మెల్యే ఆర్‌కె రోజా తీవ్రంగా గర్హించారు. జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలకు ఆహ్వానించి తీవ్రంగా పరాభవించారని, ఉగ్రవాదిని నిర్బంధంలోకి తీసుకున్నంత హడావుడి సృష్టించి గంటలపాటు పోలీసు వాహనాల్లో తిప్పారని కంటతడి పెట్టారు. వైకాపా ప్రధాన కార్యాలయం లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ చట్టసభకు ఎన్నికైన తనకే ఇలా జరిగితే, ఆంధ్రలో సామాన్య మహిళకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. మహిళనని చూడకుండా తీవ్రంగా ప్రవర్తించిన ప్రభుత్వ తీరు చూస్తుంటే, మహిళా సాధికారత వేదికపై కేంద్ర మంత్రి వెంకయ్య, సిఎం చంద్రబాబు చేసని ప్రసంగాలు వట్టిబూటకమేనని అర్థమవుతుందన్నారు. సదస్సును కేవలం కేంద్ర మంత్రి వెంకయ్య కుమార్తె, సిఎం చంద్రబాబు కోడలు బ్రహ్మణి పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. తనపట్ల డిజిపి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమని ఆగ్రహించారు. తెదేపా ప్రభుత్వం తనను హత్య చేసేందుకు పోలీసులతో కుట్ర పన్నిందని, ఆయుధాలతో వస్తున్న ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నంత హడావుడి సృష్టించారని కన్నీరుమున్నీరయ్యారు.
ఇదిలావుంటే, రోజా అరెస్టును ఖండిస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు గన్నవరం నుంచి విజయవాడకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేశారంటూ డిజిపి నండూరి సాంబశివరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొలుత ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే రోజా దిగగానే, భారీగా మోహరించిన పోలీసు బలగాలు నిర్బంధంలోకి తీసుకుని ఓ గదిలో నిలిపివేశారు. బౌద్ధగురు దలైలామా వస్తున్నారంటూ కొంతసేపు చెప్పుకొచ్చిన పోలీసులు, ఆమెను సదస్సుకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. తరువాత భారీ కస్టడీ నడుమ గన్నవరం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు జిల్లావైపు తరలించారు. పోలీసుల చర్యను ప్రతిఘటించినా కారు దిగనీయకుండా గుంటూరు జిల్లావైపు తరలించారు. పేరేచర్ల వద్ద వైకాపా శ్రేణులు పోలీసులను అడ్డుకోగా, వారిని చెదరగొట్టి హైదరాబాద్ వైపు వాహనాలను తరలించారు.
రాష్ట్రంలో రాజకీయ దుమారం
ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అరెస్టు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. అరెస్ట్ వివరాలు తెలిసిన వెంటనే వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె పార్థసారధి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, నేతలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అరెస్ట్ నిరసిస్తూ విజయవాడకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సమాచారం ఉంది.. : డిజిపి
అంతర్జాతీయ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చయవచ్చన్న పక్కా సమాచారం ఉండటం వల్లే రోజాను అరెస్ట్ చేసినట్టు తనను కలిసిన వైకాపా నేతలు డిజిపి సాంబశివరావు స్పష్టం చేశారు. రోజాకు ఆహ్వానం ఉన్నప్పటికీ, ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై ముందస్తు చర్యగా నిలువరించామన్నారు. వివాదాస్పద ప్రసంగం చేయనని హామీ ఇస్తే అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని డిజిపి నేతలకు స్పష్టం చేశారు. డిజిపిని కలిసిన వారిలో పార్థసారధితోపాటు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, గౌతంరెడ్డి తదితరులు ఉన్నారు.
ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత
రోజాను హైదరాబాద్‌కు తరలిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద స్పీడుబ్రేకర్లు రావడంతో పోలీసు జీపునుంచి దూకిన రోజా రోడ్డుమీద పరుగులు తీశారు. కాపాడండి అంటూ కేకలు పెట్టడంతో, మహిళను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని భావించిన స్థానికులు గుమిగూడారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రోజాను అదుపులోకి తీసుకుని వాహనం ఎక్కించి సత్తెనపల్లి వైపు తరలించారు. కాగా ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు దాచేపల్లి వద్ద వైసిపి కార్యకర్తలు, నాయకులు కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యాన రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టి వాహనాలను నడికుడి మీదుగా హైదరాబాద్ తరలించటం సంచలనం సృష్టించింది.