రాష్ట్రీయం

ధనలక్ష్మి కాదు.. ధైర్యలక్ష్మి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 11: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన కేసుల్ని త్వరగా విచారణ చేపట్టి దోషులను శిక్షించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో విచారణ సమయం తగ్గి, దోషులకు త్వరగా శిక్షలు పడితేనే ఆడవారిపై వేధింపులు తగ్గుతాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో మీడియా ధోరణి కూడా మారాలని, అత్యుత్సాహంతో అత్యాచార కేసులను మీడియాలో చూపిస్తే వారిని కూడా విచారించే పరిస్థితి రావాలని గవర్నర్ అన్నారు. అమరావతి పవిత్ర సంగమ క్షేత్రంలో జరుగుతున్న తొలి జాతీయ మహిళా పార్లమెంట్ రెండోరోజు శనివారం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఆమెను లక్ష్మిగా భావించే ఆలోచనా ధోరణి మారాలని చెప్పారు. నిజానికి మహిళలకు బహురూపాలున్నాయని, వాటిని గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. ఆమెను కేవలం ధనలక్ష్మిగా మాత్రమే చూడకుండా ధైర్యలక్ష్మిగా గుర్తించాలని సూచించారు. భారతీయ సమాజంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పండుగలు కూడా ఉన్నాయని, రక్షాబంధన్ ఆ తరహా వేడుకేనని గుర్తుచేశారు. మహిళను గౌరవించడాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరణలో పెట్టాలని హితవు పలికారు.
మహిళా సాధికారత అంటే మగవారితో సమానంగా వారికి అవకాశాలు కల్పించడమేనని గవర్నర్ అన్నారు. అవకాశాలు కల్పించడంతోపాటు బృంద నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండాలన్నారు. మహిళా పార్లమెంట్ న్యూస్ బులెటిన్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో కలిసి గవర్నర్ విడుదల చేశారు.
మహిళే బెస్ట్ హోమ్ మినిస్టర్
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనీ, సమాజంలో నిర్ణయాత్మక శక్తి మహిళేనని అన్నారు. కుటుంబం నుంచి సరైన సహకారం ఉంటేనే మహిళలు ముందడుగు వేయగలుగుతారన్నారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కష్టతరమనీ, అయితే ప్రతి స్ర్తిమూర్తి తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను, ఆదాయ వ్యయాలను ఆకళింపు చేసుకుని సమర్థంగా కుటుంబ ఆర్థిక నిర్వహణ చేయగలుగుతోందని ప్రస్తావించారు. బెస్ట్ హోం మినిస్టర్ ఎవరంటే ఇంట్లో మహిళేనని అన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతిక అంశాల్లో మహిళలే ముందు నేర్చుకోగలుగుతున్నారని చెప్పారు. దురదృష్టంకొద్దీ చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, అధికారుల్లోనూ ఈ శాతం తక్కువే ఉందని అన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహణ గురించి ఐవిఆర్‌ఎస్ ద్వారా అందరి అభిప్రాయాలను తెలుసుకుంటున్నానని, సదస్సు నిర్వహణ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉన్నదని ముఖ్యమంత్రి చెప్పారు. 10వేల మందికి ఆహ్వానాలు పంపిస్తే 22వేల మంది రావడమే అపూర్వమని, సాధికారత పట్ల మహిళలు ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో దీన్నిబట్టే అర్థమవుతోందన్నారు. మహిళా సమస్యలకు విమెన్ పార్లమెంట్ సహాయపడుతుందా? అని అభిప్రాయ సేకరణ కోరితే 85 శాతం అవునని చెప్పారని ఆయన తెలిపారు. ఈ సదస్సు ఇచ్చిన స్ఫూర్తితో అమరావతిలోనే మళ్లీ మహిళా పార్లమెంట్ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచే మహిళా సాధికారత ఆరంభం అవుతుందని, అదికూడా అమరావతి నుంచే మొదలవుతుందని చంద్రబాబు వివరించారు.
మహిళల సాధికారత కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే స్థాయికి మహిళలు ఎదగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. లింగ వివక్షను పూర్వకాలం నుంచి మహిళలు ఎదుర్కొంటూనే ఉంటున్నారని, మహిళలు సంపాదనాపరులైనా వారికి ఆర్థిక స్వాతంత్య్రం రావడం లేదని, నిర్ణయాల్లో ఇప్పటికీ మహిళలకు స్వేచ్ఛ ఉండటం లేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల కారణంగానే తాను జడ్జిని కాగలిగానని గుర్తుచేశారు.

చిత్రం..వేదికపై గవర్నర్, ముఖ్యమంత్రి సమాలోచనలు