రాష్ట్రీయం

బిజెపి జోక్యం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తమిళనాడు రాజకీయ సంక్షోభంలో బిజెపి పాత్ర లేదని, ఎన్నడూ రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బిజెపికి సభలో ఎలాంటి మెజార్టీ లేదని, బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదని, అలాంటపుడు తమిళనాడులో తమ పాత్ర ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు సంక్షోభం ఎఐఎడిఎంకె అంతర్గత వ్యవహారమని వెంకయ్య వ్యాఖ్యానించారు. జయలలిత విధానాలను కొనసాగించేవారే సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెంకయ్య అన్నారు. గతంలో ఎఐఎడిఎంకెతో బిజెపికి మంచి సంబంధాలే ఉన్నాయని, ఆ సంబంధాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత తమిళనాడు రాజకీయాలపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించేది ఏమీ లేదంటూనే, గవర్నర్ చట్టబద్ధంగా వ్యవహరిస్తారని అన్నారు. చట్టంలో ఏంఉందో తదనుగుణంగా గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, రాష్ట్రం విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం ఉండదని మరోసారి వెంకయ్య స్పష్టం చేశారు.