రాష్ట్రీయం

అభివృద్ధికి జాగా కరవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: నీటిపారుదల, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భూముల సేకరణ తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గతంలో ఎకరా భూమికి 10 వేల రూపాయల నుండి 20 వేల రూపాయల వరకు చెల్లిస్తూ రాగా, ఇప్పుడు ఒక్కో ఎకరానికి ఐదులక్షల నుండి 10 లక్షల వరకు కూడా చెల్లించాల్సి వస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం- 2013 అమల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం జీఓ 123ను 2015 జూలై 30న తీసుకువచ్చింది. భూయజమానితో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం మేరకు రేటు నిర్ణయించాలన్నది జీఓ ఉద్దేశం. ఈ జీఓను కోర్టు కొట్టివేసింది. ఈ పరిస్థితిలో వివిధ అభివృద్ధి పనులకు భూసేకరణ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. గృహనిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను నిర్మించడం, బస్టాండ్లు నిర్మించడం, ఎస్సీలకు సేద్యం కోసం ఒక్కొక్కరికి మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలన్న పథకం కోసం భూములను సేకరించాల్సి ఉంది.
తెలంగాణ మొత్తం 285 లక్షల ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో రైతుల ఆధీనంలో 125 లక్షల ఎకరాలు ఉండగా, 70 లక్షల ఎకరాలు అటవీ ప్రాంతంగా గుర్తించారు. గతంలో ప్రభుత్వ భూమి 40 లక్షల ఎకరాలు ఉండేది. మిగతా 50 లక్షల ఎకరాలు ఇతర అవసరాల కోసం వాడుతున్నారు. ప్రభుత్వ భూమి ఎక్కువగా పాత రంగారెడ్డి జిల్లాలో (హైదరాబాద్ నగరం చుట్టూ) 5.53 లక్షల ఎకరాలు ఉండేది. ఇంత పెద్దమొత్తంలో ఏ ఇతర జిల్లాల్లోనూ లేదు. నిజాం పాలనలో నిజాం ప్రభువుల వ్యక్తిగత అవసరాల కోసం హైదరాబాద్ నగరం చుట్టూవున్న భూములను తమ చేతుల్లో ఉంచుకున్నారు. అదే భూమి ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వ భూమిగా మారింది.
ప్రభుత్వ ఆధీనంలోని భూమిని గత నాలుగు దశాబ్దాల నుండి పేదలకు సేద్యం కోసం, పరిశ్రమలు, సామాజిక అవసరాల కోసం ఇస్తూ వచ్చారు. అంటే దాదాపు 40 లక్షల ఎకరాల వరకు పంపిణీ చేసేశారు. 2014కు ముందు కాంగ్రెస్ పరిపాలనలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఎన్. రఘువీరారెడ్డి భూముల పంపిణీపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూములన్నింటినీ పేదలకు పంపిణీ చేయాలన్నది ఆ కార్యక్రమం ఉద్దేశం. ప్రతి రెవెన్యూ గ్రామంలో ‘పంపిణీకి ఇక ప్రభుత్వ భూమి లేదు’ అన్న సర్ట్ఫికెట్టును రెవెన్యూ గ్రామాధికారి ప్రభుత్వానికి పంపించాలని, దానిపై సంబంధిత తహశీల్దారు, ఆర్‌డిఓ ధృవీకరిస్తూ సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 1998నుండి 2014 మధ్య కాలంలో ఈ విధంగా ప్రభుత్వ భూములన్నింటినీ పంపిణీ చేశారు. సేద్యానికి ఇచ్చిన భూమికాకుండా పరిశ్రమల కోసం, ఇతర అభివృద్ధి పనుల కోసం దాదాపు రెండు లక్షల ఎకరాల భూమిని పరిశ్రమల వౌలికవసతుల సంస్థ (ఐఐసి)కు అందచేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తుల నుండి, రైతుల నుండి భూమిని సేకరించాల్సి వస్తోందే తప్ప, ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. ప్రభుత్వ భూములతోపాటు భూదాన్‌భూములు, ఎండోమెంట్స్ భూములు, వక్ఫ్ భూములు చాలా వరకు ఆక్రమణకు గురై ఉన్నాయి. ఈ భూములపై కోర్టుల్లో గత నాలుగు దశాబ్దాల నుండి కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో అభివృద్ధి పనులకు భూములు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పడం లేదు.