రాష్ట్రీయం

అందరినోటా ‘అమరావతి’ నానాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 11: ప్రతిష్టాత్మకమైన జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహణ పకడ్బందీగా జరగాలని, అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించాలని, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నంచి సదస్సుకు అనేక మంది వస్తున్న నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి లోటుపాట్లు జరగరాదని, అందరిలో సంతృప్తి నెలకొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు, రెండు పారిశ్రామిక సదస్సులు (సమ్మిట్స్), విశాఖ ఇంటర్నేషనల్ నేవీ ఫ్లీట్, తిరుపతి సైన్స్ కాంగ్రెస్‌లు అన్నింటినీ విజయవంతంగా జరిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో అమరావతి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు కూడా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. హాజరైన వారిలో 90 శాతం కంటే ఎక్కువ మంది సంతృప్తి చెందేలా అన్ని ఏర్పాట్లు జరగాలని, వసతులు కల్పించాలని ఆదేశించారు. రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, భోజన ఏర్పాట్లపై మొదటి రోజు 75 శాతం మాత్రమే సంతప్తి చెందినట్లుగా సర్వేలో వెల్లడైందనే విషయం ప్రస్తావించి, దీనిని రెండు రోజుల్లో 90 శాతానికి తీసుకుళ్లాలన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంగా పనిచేయాలన్నారు. సెలవుదినాల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లుగా సదుపాయాలు ఉండాలన్నారు. రాష్ట్ర ప్రతిష్ట పెరిగేలా సదస్సు ఏర్పాట్లు జరగాలని ఆకాంక్షించారు. స్వస్థలాలకు తిరిగివెళ్లిన అతిథులు, ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ గురించి, నూతన రాజధాని అమరావతి గురించి గొప్పగా చెప్పుకునేలా మన ఏర్పాట్లు ఉండాలన్నారు. టెక్నాలజీ అభివృద్ధి వల్ల స్ర్తి, పురుష వివక్ష పూర్తిగా తొలిగిపోయిందన్నారు. విజ్ఞానంలో వివక్షకు తావులేదంటూ, ఆడ,మగ అందరూ ఒకటేనన్నారు. మహిళల హక్కులు, వారి సమస్యలు, వాటి పరిష్కార మార్గాల అనే్వషణపై చర్చలకు ఇదే మంచి తరుణంగా పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ చర్చలు అర్థవంతంగా జరగాలన్నారు. ఈ చారిత్రక అవకాశంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సదస్సులో అర్థవంతమైన చర్చల వల్ల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందని, మహిళల్లో చైతన్యం పెంపొందుతుందని తెలిపారు. సదస్సుకు హాజరయ్యేవారంతా సాంస్కృతిక రాయబారులేనని, వారివల్ల మన రాష్ట్ర ప్రతిష్ఠ అంతర్జాతీయంగా, జాతీయంగా ఇనుమడిస్తుందన్నారు. ఆదివారం ప్రతినిధుల హాజరు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండకూడదన్నారు. చర్చల విరామంలో కాఫీ, టీ, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. తాగునీరు, భోజన ఏర్పాట్లు, రవాణా, భద్రత, పారిశుద్ధ్య సౌకర్యాలు మరింతగా మెరుగుపడాలన్నారు. పవిత్ర సంగమం వద్ద ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణమ్మ హారతి, ఆహ్లాద వాతావరణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అందరూ ఆస్వాదించేలా చూడాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో సతీష్ చంద్ర, రాజవౌళి, ప్రద్యుమ్న, కలెక్టర్ బాబు, వీరపాండియన్, సిటీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.